ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్-2022 టోర్నీలో కొవిడ్ కలకలం రేపింది. గతవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh), వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (Tim Seifert) లు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆతర్వాత హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ మహమ్మారి బారిన పడడంతో అతను కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దీంతో ఢిల్లీ జట్టు వీరి సేవలను కోల్పోయింది. అయితే ఢిల్లీ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త అందించింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్. మార్ష్, టిమ్ సీఫెర్ట్ కరోనా నుంచి కోలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా మార్ష్, సీఫర్ట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను ఢిల్లీ అధికారిక సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకుంది.
మార్ష్ బరిలోకి !
కాగా టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేవలం 3 విజయాలే నమోదుచేసింది. ఆ జట్టు ఖాతాలో కేవలం 6 పాయింట్లే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏడోస్థానంలో ఉంది. ఈక్రమంలో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ఢిల్లీకి కీలకమే. ఈక్రమంలో రిషభ్ సేన గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. కాగా ఢిల్లీ ఓపెనింగ్‌లో వార్నర్, పృథ్వీ షా శుభారంభం అందిస్తున్నారు. అయితే మిడిలార్డర్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. ఈక్రమంలో నేటి మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ బరిలోకి దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక గత మ్యాచ్‌లో చోటు చేసుకున్న నో బాల్ వివాదంతో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, బౌలర్ శార్దూల్ ఠాకూర్‌లపై విమర్శలు వచ్చాయి.
We are feeling GOOD 🥺💙
Great to have you back at the training, boys 🤩#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/k9XLbx44qd
— Delhi Capitals (@DelhiCapitals) April 27, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Russia – Ukraine: యుద్ధం వేళ ఆందోళన కలిగిస్తున్న లైంగిక దాడులు.. చిన్నారులనూ వదలని వైనం