IPL 2022: ధోని టీంలో చేరిన కొత్త ప్లేయర్.. సూరత్‌లో మొదలైన సీఎస్‌కే సందడి..

ఐపీఎల్ 2022 కోసం చెన్నై జట్టు సన్నాహాలు ప్రారంభించింది. సూరత్‌లో టీమ్ క్యాంప్ వేసింది. అక్కడ ఆటగాళ్లందరూ నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నారు.

IPL 2022: ధోని టీంలో చేరిన కొత్త ప్లేయర్.. సూరత్‌లో మొదలైన సీఎస్‌కే సందడి..
Ipl 2022 Chennai Super Kings

Updated on: Mar 08, 2022 | 9:32 AM

ధోని(Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఐపీఎల్ 2022 కోసం సన్నాహాలు ప్రారంభించింది. సూరత్‌లో టీమ్ క్యాంప్ వేసింది. అక్కడ ఆటగాళ్లందరూ చెమటలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఆ టీం సన్నాహాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఐర్లాండ్‌కు చెందిన ఓ ఆటగాడు జట్టులో చేరిన చేరాడు. IPL 2022 సన్నాహాలకు భిన్నమైన స్థాయిని అందించడానికి సీఎస్కే టీం ఐర్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్‌(Josh Little)ను టీంలో చేర్చుకుంది. 22 ఏళ్ల జోస్ చెన్నై జట్టులో నెట్ బౌలర్ పాత్ర పోషిస్తాడు. అంటే, ప్రతి మ్యాచ్‌కి ముందు, అతను సీఎస్‌కే బ్యాటర్లను సిద్ధం చేసేందుకు సహాయం చేస్తూ కనిపిస్తాడు.

ఈమేరకు క్రికెట్ ఐర్లాండ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫాస్ట్ బౌలర్ జోస్ లిటిల్ నెట్ బౌలర్‌గా చేరినట్లు పేర్కొంది. ఇప్పటికే చెన్నై టీం కీలక ఆటగాళ్లతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మార్చి 26 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2022లో మరోసారి సత్తా చాటేందుకు ధోని తన ప్లాన్స్‌ను సిద్ధం చేస్తున్నాడు.

Also Read: Sunil Gavaskar-Shane Warne: షేన్ వార్న్‌ గురించి అలా అనాల్సింది కాదు.. అసలు అలా ప్రశ్నించడమే తప్పు: సునీల్ గవాస్కర్

రంజీ ట్రోఫీలో ‘నయా కోహ్లీ’ వీరవిహారం.. 3 మ్యాచ్‌ల్లో 526 పరుగులతో బౌలర్ల ఊచకోత.. ఎవరో తెలుసా?