AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆల్‌టైమ్‌ ఫేవరెట్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించిన భజ్జీ.. కెప్టెన్‌ను ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా?

Harbhajan Singh All Time IPL X1: 2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) సక్సెస్‌ఫుల్‌గా 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈక్రమంలో చాలామంది ఆటగాళ్ల లాగే టీమిండియా మాజీ స్పిన్నర్‌, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) కూడా

IPL 2022: ఆల్‌టైమ్‌ ఫేవరెట్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించిన భజ్జీ.. కెప్టెన్‌ను ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా?
Harbhajan Singh
Basha Shek
|

Updated on: Apr 26, 2022 | 2:05 PM

Share

Harbhajan Singh All Time IPL X1: 2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) సక్సెస్‌ఫుల్‌గా 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈక్రమంలో చాలామంది ఆటగాళ్ల లాగే టీమిండియా మాజీ స్పిన్నర్‌, ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్ (Harbhajan Singh) కూడా తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈక్రమంలో తన ఫేవరెట్‌ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అలాగే హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రాలకు కూడా తన జట్టులో చోటు కల్పించాడు. మొత్తం మీద టీమిండియా నుంచి ఐదుగురు ఆటగాళ్లు, వెస్టిండీస్‌కు చెందిన ముగ్గురికి, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లకు చెందిన తలో ఆటగాడికి స్థానం కల్పించాడు. అయితే ఈ జట్టులో ఎలాంటి సంచలనాలు లేనప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడైన ఆసీస్‌ స్టార్ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వార్నర్‌కు ఒక్కడికి స్థానం కల్పించి ఉంటే జట్టు మరింత బాగుండేదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా.. ఇక తన ఆల్‌టైం ఫేవరెట్‌ ఐపీఎల్ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మలను ఎంచుకున్నాడు భజ్జీ. వన్‌డౌన్‌లో కింగ్ కోహ్లిని, నాలుగు, ఐదు స్థానాల కోసం షేన్‌ వాట్సన్‌, ఏబీ డివిలియర్స్‌లను ఎంచుకున్నాడు. ఆరో స్థానం కోసం ధోనిని ఎంపిక చేసిన హర్భజన్‌.. ఆల్‌రౌండర్ల కోటాలో కీరన్‌ పోలార్డ్‌, రవీంద్ర జడేజాలకు స్థానం కల్పించాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే.. కరేబియన్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌కి చోటు కల్పించాడు. అయితే అమిత్‌ మిశ్రా, చాహల్‌ పేర్లను కూడా పరిశీలించాల్సి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే నరైన్‌ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తుండడమే అతని ఎంపికకు కారణమని తెలుస్తోంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ స్థానాలను ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లలో ఒకరైన లసిత్‌ మలింగ, ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలను ఎంచుకున్నాడు.

భజ్జీ ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ ఐపీఎల్‌ టీమ్‌: ఎంఎస్‌ ధోని (కెప్టెన్), క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, షేన్ వాట్సన్, ఏబీ డివిల్లియర్స్, రవీంద్ర జడేజా, కీరన్ పోలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: 

QR Code Alert: మీరు QR కోడ్‌తో లావాదేవీలు జరిపితే జాగ్రత్తగా ఉండండి.. ఈ తప్పులు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీయే..!

Cibil Score: మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? మీ సిబిల్‌ స్కోర్‌ పడిపోవడం ఖాయం..!

Pawan Kalyan : స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. శరవేగంగా హరిహర వీరమల్లు షూటింగ్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటో..