IPL 2022: ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ఆడేనా? ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే నో ఛాన్స్ అంటోన్న నివేదికలు..

|

Mar 14, 2022 | 9:00 PM

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022లో ఆడతాడా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి చేరుకున్నాడు.

IPL 2022: ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా ఆడేనా? ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైతే నో ఛాన్స్ అంటోన్న నివేదికలు..
Gujarat Titans Captain Hardik Pandya
Follow us on

హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఐపీఎల్ 2022(IPL 2022)లో ఆడతాడా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం పాండ్యా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి చేరుకున్నాడు. అక్కడ అతను మరో రెండు రోజుల్లో ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొంటాడు. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఐపీఎల్ ఆడగలడు. ఒకవేళ విఫలమైతే మాత్రం ఐపీఎల్ 2022లో పాల్గొనేందుకు అనుమతి ఉండకపోవచ్చు. హార్దిక్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. టెస్ట్ సమయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, 28 ఏళ్ల హార్దిక్.. తన జట్టు కోసం పూర్తి ఫిట్‌నెస్‌తో బౌలింగ్ చేయడానికి అనుమతి లభిస్తుందా లేదా అనేది కూడా తేలనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

BCCI కు చెందిన అధికారుల వార్తల మేరకు, “హార్దిక్ రాబోయే రెండు రోజులు NCAలో ఉంటాడు.వివిధ ఫిట్‌నెస్ పరీక్షల్లో పాల్గొంటాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్, UAEలో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి ఎలాంటి క్రికెట్ ఆడలేదు’ అని పేర్కొన్నారు.

గత కొంతకాలంగా ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి అయినందున.. ఆటగాళ్లు తప్పక ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గత ఏడాది శ్రేయాస్ అయ్యర్ కూడా భుజం గాయం తర్వాత ఐపీఎల్‌లో ఆడే ముందు ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నాడు.

జాతీయ జట్టు, NCA వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ వారి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌లను గమనిస్తూ ఉంటారు. బరోడాలో టైటాన్స్ ఐదు రోజుల శిక్షణా శిబిరంలో హార్దిక్ రెండు-మూడు సీజన్లలో బౌలింగ్ చేసినట్లు తెలిసింది.

Also Read: IND vs SL: 100 శాతం విజయాలే.. న్యూజిలాండ్‌తో మొదలై విండీస్, శ్రీలంక టీంలను వైట్ వాష్ చేసిన రోహిత్..

Watch Video: బంతి విసరకముందే నాన్‌స్ట్రైకర్‌ అత్యుత్సాహం.. ఇంత తొందరైతే ఎలా బ్రో అంటోన్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో