IPL 2022: చెన్నైకు మరో షాక్‌.. గాయంతో స్టార్ ప్లేయర్‌ ఔట్‌!.. క్లారిటీ ఇచ్చిన కోచ్‌..

|

Apr 27, 2022 | 7:02 PM

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)ను దురదృష్టం వెంటాడుతోంది. ఓవైపు వరుస ఓటములతో ఇప్పటికే ఫ్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరింత ఇబ్బందులను కలిగిస్తున్నాయి.

IPL 2022: చెన్నైకు మరో షాక్‌.. గాయంతో స్టార్ ప్లేయర్‌ ఔట్‌!.. క్లారిటీ ఇచ్చిన కోచ్‌..
Chennai Super Kings
Follow us on

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)ను దురదృష్టం వెంటాడుతోంది. ఓవైపు వరుస ఓటములతో ఇప్పటికే ఫ్లే ఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుకు ఆటగాళ్ల గాయాలు మరింత ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా దీపక్‌ చాహర్‌, ఆడమ్‌ మిల్నే సేవలను కోల్పోయిన చెన్నై్కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తోన్న అంబటి రాయుడు (Ambati Rayudu) గాయం బారిన పడినట్లు ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. కాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విఫలమైనా మెరుపు ఇన్నింగ్స్‌ (39 బంతుల్లో 78; 7 ఫోర్లు, 6 సిక్సర్లు)తో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు రాయుడు. అయితే అప్పటికే గాయంతో బాధపడుతున్న అంబటి చాలాసేపు బ్యాటింగ్‌ చేశాడని, దీంతో గాయం మరింత తీవ్రమైందని ఫ్లెమింగ్‌ తెలిపాడు. కాగా సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను మే 1న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌ సమయానికి అంబటి కోలుకుంటాడన్న నమ్మకం తనకు లేదని కోచ్‌ పేర్కొనడం గమనార్హం.

కాగా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాటలను బట్టి చూస్తే.. చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాయుడు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. కాగా ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 129.47 స్ట్రైక్‌ రేట్‌తో మొత్తం 246 పరుగులు చేశాడు. అసలే వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న చెన్నై జట్టుకు ఫామ్‌లో ఉన్న రాయుడు గాయం బారిన పడడంతో మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం రెండంటే రెండు మ్యాచ్‌లు గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌ దశకు వెళ్లాలంటే ఆ జట్టు అద్భుతంగా ఆడడంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

NSUI Recruitment 2022: నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో 152 టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

KTR in Plenary: బీజేపీ చేతిలో అధికారం – భారతావనికి అంధకారం.. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరంః కేటీఆర్

Viral Video: చిన్నారి బాలిక మ్యాజిక్ టాలెంట్ .. నెట్టింట్లో వీడియో వైరల్.. 60లకుపైగా లైక్స్ సొంతం