Watch Video: అట్లుంటది మరి ధోనీతో.. దెబ్బకు సిగ్నల్ మార్చేసిన అంపైర్.. వైరల్ వీడియో..

గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన CSK vs MI మ్యాచ్‌లో, అంపైర్ తన సిగ్నల్‌ను వైడ్ నుంచి ఔట్‌కి మార్చాడు. దీనికి అభిమానులంతా MS ధోనీ క్రెడిట్ అంటూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు.

Watch Video: అట్లుంటది మరి ధోనీతో.. దెబ్బకు సిగ్నల్ మార్చేసిన అంపైర్.. వైరల్ వీడియో..
Ipl 2022 Ms Dhoni
Follow us

|

Updated on: May 13, 2022 | 1:48 PM

గురువారం వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మరో అద్భుతమైన ఎన్‌కౌంటర్‌‌లో తలపడ్డాయి. MI పదో స్థానంలోనూ, CSK తొమ్మిదో స్థానంలోనూ ఉండటంతో, రెండు జట్లు గట్టి పోటీని ప్రదర్శించాయి. CSK vs MI మ్యాచ్‌లో చాలా విషయాలు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. అందులో ఒకటి అంపైర్ చిర్ర రవికాంతరెడ్డి ప్రవర్తన కూడా ఉంది. వైడ్ కోసం సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా, వెంటనే తన మనసు మార్చుకుని ఔట్‌కి సంకేతం ఇచ్చాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్లు చూస్తే తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ సంఘటన ముంబై ఇండన్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ సమయంలో జరిగింది. సిమర్‌జీత్ సింగ్ అద్భుతమైన ఇన్‌స్వింగ్ డెలివరీని హ్రితిక్ షోకీన్ ఆడాడు. అయితే, బాల్ బ్యాట్‌కు తాకిందనుకున్న్ ధోనీ, అప్పీల్ చేశాడు. ఆ తర్వాత బౌలర్ కూడా తీవ్రమైన అరుపులతో అంపైర్‌ వైపు చూస్తూ అప్పీల్ చేశాడు. దీంతో వైడ్ ఇవ్వాల్సిన బాల్‌కు ఔట్ అంటూ చేయి చూపించాడు. కానీ, బ్యాట్స్‌మన్ అయితే చాలా నమ్మకంగా కనిపించాడు. దీంతో నేరుగా రివ్యూను కోరుకున్నాడు. రెఫరల్ తర్వాత, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, షోకీన్ నడుముపై బంతి తగిలిందని, నిజంగానే శబ్దం వినిపించిందంటూ నాటౌ‌ట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని రద్దు చేసినప్పటికీ, ధోని కాన్ఫిడెంట్ అప్పీల్‌ని చూసిన తర్వాత అంపైర్ తన మనసు మార్చుకున్నాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ క్రెడిత్ అంతా ధోనికే చెందుతుందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో అంపైర్ స్కానర్‌లో ఉన్నారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు లేదా థర్డ్ అంపైర్‌ల నుంచి నిర్ణయాలైనా, ఆలస్యంగా కొన్ని అనిశ్చిత కాల్‌లు వస్తున్నాయి. డెవాన్ కాన్వేకి ఎల్‌బీడబ్ల్యూ ఔట్ అయినందున, వాంఖడే స్టేడియంలో పవర్ కట్ ఉండడంతో CSK ఓపెనర్ DRS రివ్యూ తీసుకోలేకపోయింది. కాన్వే, రాబిన్ ఉతప్ప ఇద్దరూ ఎల్‌బీడబ్ల్యూ అవుట్‌గా ఔట్ అయ్యారు. వారిద్దరూ రివ్యూ కోరుకోలేదు. అయితే హాస్యాస్పదంగా, ఉతప్ప ఔట్ అయిన తర్వాత కేవలం ఒక బంతి మాత్రమే ఉండగా DRS రివ్యూ సిస్టమ్ అమలులోకి వచ్చింది.

Also Read: IPL 2022 Playoffs Scenario: ముగిసిన ముంబై-చెన్నై ప్రయాణం.. ప్లే ఆఫ్స్ రేసులో ఏ జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే?

IPL 2022: కోల్‌కతాకు భారీ షాక్.. దూరమైన రూ. 7.25 కోట్ల ఆటగాడు.. కనీసం 7 మ్యాచ్‌లు ఆడలేకుండానే..