DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..

DC vs PBKS: పంజాబ్‌పై ఢిల్లీ సూపర్‌ విక్టరీ సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి సాధించింది. ఢిల్లీ ఓపెనర్లుగా

DC vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో రాణించిన డేవిడ్‌ వార్నర్..
Dc Vs Pbks

Updated on: Apr 20, 2022 | 10:41 PM

DC vs PBKS: పంజాబ్‌పై ఢిల్లీ సూపర్‌ విక్టరీ సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి సాధించింది. ఢిల్లీ ఓపెనర్లుగా వచ్చిన పృధ్వీషా, డేవిడ్‌ వార్నర్ పంజాబ్‌ బౌలర్లకి చుక్కలు చూపించారు. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లో 60 (10 ఫోర్లు 1 సిక్సర్‌) పరుగులు చేశాడు. ఫృధ్వీషా 20 బంతుల్లో 41 (7 ఫోర్లు 1 సిక్స్‌) పరుగులు చేసి చాహర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సర్పరాజ్‌ ఖాన్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌కి ఒక వికెట్‌ దక్కింది. అంతకుముందు పంజాబ్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించింది. స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది.జితేశ్‌ శర్మ (32), మయాంక్‌ అగర్వాల్ (24), షారుఖ్‌ ఖాన్ (12) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, అక్షర్‌ 2, కుల్‌దీప్‌ 2, లలిత్ యాదవ్ 2, ముస్తాఫిజర్‌ చెరో వికెట్ తీశారు. దీంతో పాయింట్ల పట్టికలో దిల్లీ (6) ఆరో స్థానానికి ఎగబాకింది.

Health Tips: కొలస్ట్రాల్‌ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాలని ఉపయోగించుకోండి.. మంచి లాభాలని ఆర్జించండి..!

Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!

Loading...
Unable to load recommendations.
Follow Us