Watch Video: లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన చెన్నై ఆటగాళ్లు.. కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో రచ్చ మాములుగా లేదుగా..

|

Apr 20, 2022 | 4:40 PM

Devon Conway Wedding: కాన్వాయ్ సహచరులందరితో సరదాగా పోజులిచ్చాడు.30 ఏళ్ల డెవాన్ కాన్వే తన స్నేహితురాలు కిమ్ వాట్సన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. డెవాన్ ప్రస్తుతం IPL కోసం భారత్‌లో ఉన్నాడు. అతని స్నేహితురాలు కిమ్ కూడా..

Watch Video: లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన చెన్నై ఆటగాళ్లు.. కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో రచ్చ మాములుగా లేదుగా..
Devon Conway Pre Wedding Ceremony
Follow us on

Devon Conway Wedding: ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంబరాల్లో మునిగితేలుతోంది. చెన్నై బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఆటగాళ్లు చాలా సరదాగా గడిపారు. డెవాన్ కాన్వే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. చెన్నై ఫ్రాంచైజీ ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో కాన్వే ప్రీ వెడ్డిండ్ వేడుకను నిర్వహించారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించాడు. మహి పసుపు రంగు కుర్తాలో కనిపించగా, వరుడు కాన్వే తెల్లటి కుర్తా, లుంగీలో కనిపించాడు. ధోనీ చాలా కూల్‌గా కనిపించడంతోపాటు పూర్తి ఉత్సాహంతో ఈవెంట్‌కు హాజరయ్యాడు.

కాన్వాయ్ సహచరులందరితో సరదాగా పోజులిచ్చాడు.30 ఏళ్ల డెవాన్ కాన్వే తన స్నేహితురాలు కిమ్ వాట్సన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. డెవాన్ ప్రస్తుతం IPL కోసం భారత్‌లో ఉన్నాడు. అతని స్నేహితురాలు కిమ్ కూడా అతనితోనే ఉంటోంది. కాన్వే ప్రీ వెడ్డింగ్ వేడుకలో చెన్నై జట్టు ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో లుంగీలో కనిపించారు. ఈ పార్టీలో, మిచెల్ సాంట్నర్, ఇంగ్లండ్‌కు చెందిన మొయిన్ అలీ, CSK కెప్టెన్ రవీంద్ర జడేజా, ధోనీతో సహా శివమ్ దూబే వంటి సహచర ఆటగాళ్లు హాజరయ్యారు.

చెన్నై జట్టు ఈవెంట్ జరిగిన ట్రైడెంట్ హోటల్‌లో బస చేసింది. పార్టీలో డెవాన్ కాన్వేతో పాటు ఆటగాళ్లంతా లుంగీలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఐపీఎల్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వేకి ఇది మొదటి సీజన్. అతను ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. కాన్వేను మెగా వేలంలో చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇందుకోసం కోటి రూపాయలు ఖర్చు చేసింది. పెళ్లికి ముందు జరిగిన పార్టీలో ధోనీ, జడేజా సహా ఆటగాళ్లు, సిబ్బంది అందరూ కాన్వేకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పార్టీలో కేక్ కూడా కట్ చేశారు. సీఎస్‌కే ఆటగాళ్లు కాన్వే ముఖంపై కేక్‌ను పూసి, అనంతరం అంతా కలిసి డ్యాన్స్ చేశారు.

చెన్నై ప్రదర్శన చాలా పేలవం..

ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లకు గాను ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కీలక ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లేకపోవడమే చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఈ ఈవెంట్‌కు హాజరైన తర్వాత, జట్టు నూతన ఉత్సాహంతో మైదానంలోకి దిగి, విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?

IPL 2022: పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకొచ్చిన బెంగళూరు.. మిగతా జట్ల పరిస్థితేంటంటే..