IPL 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ.. వరుసగా నాలుగో సీజన్‌లోనూ..

|

Mar 23, 2022 | 6:30 AM

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ధనాధన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌( IPL 2022 ) టోర్నీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.

IPL 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ.. వరుసగా నాలుగో సీజన్‌లోనూ..
Ipl 2022
Follow us on

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ధనాధన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌( IPL 2022 ) టోర్నీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. శనివారం (మార్చి26) ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్(CSK) తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR) తలపడనుంది. కాగా క్రికెట్‌లో అత్యంత రిచ్‌ లీగ్‌ గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌ ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం ప్రారంభ టోర్నీ నుంచే ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్‌ హీరో, హీరోయిన్లతో అదిరిపోయే ఫెర్మామెన్స్‌లకు కూడా వేడుకల్లో చోటు కల్పిస్తోంది. అయితే 2018 ఐపీఎల్‌ తర్వాత వివిధ కారణాల వల్ల 2018 తర్వాత ఈ ఆరంభ వేడుకలు జరగలేదు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళిగా 2019 ఈవెంట్ రద్దు చేయగా, ఈ కార్యక్రమానికి కేటాయించిన నగదును అమరవీరులకు కేటాయించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సీజన్ల ఆరంభ వేడుకలు రద్దయ్యాయి. తాజాగా మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు సంబంధించి కూడా ఆరంభ వేడుకలను నిర్వహించకూడదని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది.

కాగా దేశంలో కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. దీంతో మ్యాచ్‌లకు ప్రేక్షకులను కూడా అనుమతించింది బీసీసీఐ. అయితే నాలుగో వేవ్‌ ఊహగానాలను నిజం చేస్తూ, చైనా, దక్షిణ కొరియా, యూరప్‌ దేశాల్లో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి కొవిడ్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఐపీఎల్‌-2022 ఆరంభ వేడుకలను నిర్వహించడం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వరుసగా నాలుగో ఏడాది ఆరంభ వేడుకలు లేకుండానే ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కాగా గత సీజన్లలో హృతిక్‌ రోషన్‌, పరిణీతి చోప్రా, వరణ్‌ ధావన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రణ్‌వీర్ సింగ్‌ తదితర బాలీవుడ్ నటీనటుడు ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. తమ అదిరిపోయే డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

Also Read:RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..

Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!

NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలు..!