IPL 2022 Auction: ధోని స్కెచ్ వేలంలో ఫలించేనా.. వీరిని తిరిగి చెన్నై పొందేనా?

|

Feb 11, 2022 | 9:34 PM

Chennai Super Kings: ఐపిఎల్ వేలానికి ముందు CSK 4గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందులో ఎంఎస్ ధోని, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, బ్యాటర్ రుతురాజ్ గైడ్ ఉన్నారు. ఇంకా సీఎస్కే వద్ద రూ.48 కోట్లు మిగిలాయి.

IPL 2022 Auction: ధోని స్కెచ్ వేలంలో ఫలించేనా.. వీరిని తిరిగి చెన్నై పొందేనా?
Ipl 2022 Auction Chennai Super Kings
Follow us on

IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలం రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. ఐపీఎల్ (IPL) జట్లు తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లను పొందేందుకు తమ వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)కు భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేయడమే కాకుండా జట్టుకు కీలక సభ్యులను తిరిగి పొందడం కూడా చాలా కష్టమైన పనిగా మారింది. సీఎస్కే ఐపీఎల్ వేలానికి ముందు 4గురు ఆటగాళ్లను ఉంచుకుంది. ఇందులో టాలిస్మానిక్ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీతోపాటు రుతురాజ్ గైక్వాడ్ ఈ లిస్టులో ఉన్నారు. చెన్నై పర్సులో ఇంకా రూ. 48 కోట్లు మిగిలి ఉన్నాయి. దీంతో తమ డబ్బును ఖర్చు చేసే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఐపీఎల్ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా..

చెన్నై సూపర్ కింగ్స్ (మిగిలిన పర్సు – రూ. 48 కోట్లు):

రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు)
ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు)
మొయిన్ అలీ (రూ. 8 కోట్లు)
రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు)

ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా భవిష్యత్తులో లీగ్‌ని యూఏఈ లేదా మరేదైనా వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నందున సీఎస్‌కే సృష్టించే జట్టు కేవలం భారతీయ పరిస్థితుల కోసం మాత్రమే కాదనే వాస్తవాన్ని చెన్నై మేనేజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి.

వేలంలో CSK ఈ 5గురు ఆటగాళ్ల కోసం బరిలోకి దిగనుంది:

1) క్వింటన్ డి కాక్ (రూ. 4 కోట్లు): దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం బ్యాటర్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే స్టంప్‌ల వెనుక కూడా చాలా అద్బుతంగా రాణిస్తాడు. సీఎస్కే దీర్ఘకాలంలో ధోనీకి ప్రత్యామ్నాయం కోసం వెతకాల్సి ఉంది. ఓపెనింగ్ స్లాట్ కోసం ఫాఫ్ డు ప్లెసిస్‌ని మించిన ఆటగాడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. డి కాక్ ఐపీఎల్‌లో తన సత్తాను నిరూపించుకున్నాడు. దీంతో సీఎస్కే మొదటి ఛాయిస్‌లో నిలిచాడు.

2) శార్దూల్ ఠాకూర్ (గరిష్టంగా రూ. 4 కోట్లు): నైపుణ్యం కలిగిన వైట్-బాల్ బౌలర్, అద్భుతంగా పేస్‌ని మార్చగల సామర్థ్యం, బ్యాటింగ్‌లో డెప్త్‌ని నిర్ధారించే అవసరమైన లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. సీఎస్కే అతన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది.

3) రోవ్‌మన్ పావెల్ (గరిష్టంగా రూ. 1 కోటి): ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌లో పావెల్ తన సామర్థ్యాలను ప్రదర్శించాడు. విండీస్ ఆటగాళ్ళు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. కానీ, పందెం వేయడం ప్రమాదకరం కావొచ్చు. ఎందుకంటే ఎప్పుడు రాణిస్తారో, ఎప్పుడో పేలవ ఫాంతో ఉంటారో తెలియదు. అయినా ఈ ఆటగాడిని దక్కించుకునేందుకు సీఎస్కే ప్లాన్ చేస్తుంది.

4) రాజ్ అంగద్ బావా (గరిష్టంగా రూ. 50 లక్షలు): భవిష్యత్తు కోసం సీఎస్కే ఈ ఆల్‌రౌండర్‌ని వేలంపాటలో ఎంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది.

5) దీపక్ చాహర్ (గరిష్టంగా రూ. 3 కోట్లు): సీఎస్కే కోసం పవర్‌ప్లేలో కీలకంగా రాణించిన దీపక్ చాహర్.. ఎంఎస్ ధోని విశ్వాసాన్ని సంపాదించాడు. దీంతో ఈ ఆటగాడిని తిరిగి పొందాలని ఆశిస్తోంది.

Also Read: IPL 2022 Auction: ఈ 5గురి కోసం ముంబై ఎదురుచూపులు.. లిస్టులో u19 ప్లేయర్ కూడా?

IPL 2022 Auction: కేకేఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. వేలంలో ఈ 5గురు సొంతమయ్యేనా?