ఐపీఎల్ 2022(IPL 2022) కి మరికొన్ని రోజుల సమయమే మిగిలింది. లీగ్ దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ పెరుగుతోంది. ఈసారి రెండు కొత్త జట్లు పెరగడంతో ఉత్కంఠ మరింత ఎక్కువైంది. ఇది కాకుండా, చాలా మంది ఆటగాళ్ల జెర్సీల రంగు కూడా మారింది. అయితే వీటన్నింటి మధ్య పెద్ద వార్త ఏంటంటే.. ఈ లీగ్ ప్రారంభం కాగానే 26 మంది ఆటగాళ్లు దీనికి దూరంగా ఉండనున్నారు. ఈ ప్రభావం ఐపీఎల్ 2022 లోని దాదాపు ప్రతి ఫ్రాంచైజీపై పడింది. కానీ, ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్లకు మాత్రం భారీ నష్టం జరగబోతోంది.
IPL 2022 నుంచి దాదాపుగా 26 మంది ఆటగాళ్ళు ఈ ఈవెంట్‌కు దూరం కానున్నారు. మొదటి వారంలో మాత్రమే ఆడటం కనిపించరు. అంటే రెండో వారం నుంచి లీగ్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తొలి వారం మాత్రమే ఈ 26 మంది ఆటగాళ్ల సేవలను ఫ్రాంచైజీలు పొందే అవకాశం లేదు. కొందరికి అంతర్జాతీయ మ్యాచులు, కొందరికి వ్యక్తిగత కారణాలు, చాలా మందికి గాయాల కారణంగా ఈ లోటు ఏర్పడింది.
ఢిల్లీ, లక్నో టీంలకు భారీ నష్టం..
IPL 2022 మొదటి వారంలో ఆడని 26 మంది ఆటగాళ్ల జాబితాను ఇప్పుడు చూద్దాం. వారిలో అత్యధిక సంఖ్యలో ఆటగాళ్లు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో ఫ్రాంచైజీలకు చెందినవారు. ఈ రెండు జట్లకు చెందిన తలో 5 మంది ఆటగాళ్లు IPL 2022 నుంచి మొదటి వారంలో అందుబాటులో ఉండరు.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఎన్రిఖ్ నోర్కియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగీ ఎన్గిడి అందుబాటులో ఉండరు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్‌లో మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మైయర్స్, మార్క్ వుడ్, క్వింటన్ డి కాక్ పేర్లు చేరాయి. వీరిలో మార్క్ వుడ్ గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలిగాడు.
ఈ ఆటగాళ్లు కూడా..
వీరితో పాటు జానీ బెయిర్‌స్టో, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్ పంజాబ్ కింగ్స్ టీంలో కనిపించరు. RCB నుంచి గ్లెన్ మాక్స్‌వెల్, జోస్ హాజిల్‌వుడ్, బెహ్రెన్‌డార్ఫ్ కూడా తొలి వారంలో కనిపించరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఐడాన్ మార్క్‌రామ్, శాన్ అబాట్, మార్కో యాన్సన్, అలాగే రాజస్థాన్ రాయల్స్ నుంచి రాసి వాన్ డెర్ దుస్సే, కోల్‌కతా నుంచి ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, చెన్నై నుంచి డ్వేన్ ప్రిటోరియస్‌తో పాటు ముంబై ఇండియన్స్ నుంచి జోఫ్రా ఆర్చర్ కనిపించరు.
Also Read: Ranji Trophy: 37 ఫోర్లు, 2 సిక్సర్లతో డబుల్ సెంచరీ.. 17 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వీరవిహారం.. బౌలర్ల ఊచకోత!
IND vs SL, 2nd Test, Day 3, Live Score: మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. స్కోరెంతంటే?