IPL 2021: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన బీసీసీఐ… ఈసారి భారత్‌ వేదికగానే ఐపీఎల్‌.. ప్రేక్షకులకూ…

IPL 2021 Starts From: గతేడాది కరోనా మహమ్మారి కారణంగా.. ఐపీఎల్‌ కేవలం టీవీ ప్రేక్షకులకే పరిమితమైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు స్టేడియంలకు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో అందరూ నిరాశపడ్డారు. అయితే..

IPL 2021: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త చెప్పిన బీసీసీఐ... ఈసారి భారత్‌ వేదికగానే ఐపీఎల్‌.. ప్రేక్షకులకూ...

Updated on: Jan 31, 2021 | 5:20 PM

IPL 2021 Starts From: దేశాలతో, ప్లేయర్స్‌తో సంబంధం లేకుండా క్రికెట్‌ అభిమానులందరూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను ఎంతగానో ఇష్టపడుతుంటారు. మైదానంలో సిక్సర్ల మోత, అద్భుతమైన క్యాచ్‌లు, ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌ చివరి క్షణాలు ఇలా ఐపీఎల్‌లో ప్రతిక్షణం అత్యద్భుతమే.
అయితే గతేడాది కరోనా మహమ్మారి కారణంగా.. ఐపీఎల్‌ కేవలం టీవీ ప్రేక్షకులకే పరిమితమైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు స్టేడియంలకు ప్రేక్షకులను అనుమతించకపోవడంతో అందరూ నిరాశపడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐపీఎల్‌ మళ్లీ ఎప్పటిలాగే నిర్వహిస్తారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్‌ ఏప్రిల్‌ 11 నుంచి జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ సీజన్‌-2021ని భారత్ వేదికగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్‌ కంటే భారత్‌లోనే మెరుగైన పరిస్థితి ఉందని బీసీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ఈ ఏడాది ప్రేక్షకులను కూడా స్టేడియంలోకి అనుమతిచ్చే అవకాశముందని. 25 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతిచ్చే అవకాశాలున్నాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ దుమాల్ తెలిపారు.

Also Read: ఆసుపత్రి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ డిశ్చార్జ్.. మరి కొద్దిరోజులు విశ్రాంతి అవసరమంటున్న వైద్యులు..

Loading...
Unable to load recommendations.
Follow Us