IPL 2021: ‘ఈ సాలా కప్ నమదే’ నిజం చేస్తారా.? విరాట్ కోహ్లీ ముందు అనేక సవాళ్లు.!
IPL 2021: బెంగళూరు బలమైన జట్టు. ఎంతోమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయవంతంగా నడిపిస్తున్నాడు.
IPL 2021 RCB Team Profile: బెంగళూరు బలమైన జట్టు. ఎంతోమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయినా ఓ లోటు. అదే ట్రోఫీ. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ సరికొత్త టీంతో ఈ ఏడాది ట్రోఫీపై గురి పెట్టింది. విరాట్ కోహ్లీ నాయకత్వం.. ఏబీ డివిలియర్స్ అపార అనుభవం జట్టుకు ప్రధాన బలం.
గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, డాన్ క్రిస్టియన్, ఫిన్ అలెన్, కైల్ జామిసన్ లాంటి విదేశీ ఆటగాళ్లపైనే ఆర్సీబీ యాజమాన్యం నమ్మకం పెట్టుకుంది. ఇక మహ్మద్ అజరుద్దీన్, దేవదూట్ పడిక్కల్ లాంటి యువ ఆటగాళ్లు ఇప్పటికే దేశవాళీ టోర్నీలలో తమ ప్రతిభను నిరుపించుకున్నారు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి స్టార్ ప్లేయర్స్.. ఆడమ్ జాంపా, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, చాహల్ వంటి బౌలర్లు జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఐపీఎల్ 2021లో అవకాశాలు..
ఆర్సీబీ గత సీజన్‌లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. సీజన్ టాప్ స్కోరర్స్‌గా పడిక్కల్ (473), కోహ్లీ (466), డివిలియర్స్ (454) నిలిచారు. ఇక బౌలింగ్‌లో చాహల్(21) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆర్సీబీ తన మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 9న ఆడుతుంది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను కనబరిస్తే.. ఖచ్చితంగా ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ జట్టు టాప్ 4లో నిలుస్తుంది. అంతేకాకుండా బ్యాటింగ్ లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఉండటంతో భారీ స్కోర్లను అలవోకగా చేధించే అవకాశాలు ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
కోహ్లీ (కెప్టెన్), సిరాజ్, షాబాజ్ అహ్మద్, కేఎస్ భరత్, చహల్, సైనీ, దేవ్‌దత్ పడిక్కల్, ప్రభుదేశాయ్, సచిన్ బేబి, పవన్ దేశ్‌పాండే, సుందర్, హర్షల్ పటేల్, రజత్, మహమ్మద్ అజహరుద్దీన్, డివిలియర్స్, రిచర్డ్‌సన్, జంపా, మ్యాక్స్‌వెల్, క్రిస్టియన్, జెమీసన్, అలెన్, సామ్స్.
Also Read: Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!
”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!
అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!
Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?