IPL 2021: 37 బంతులతో తుఫాను సెంచరీ.. విరాట్ కోహ్లీ ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు ఛాన్స్ ఇస్తాడా.?

| Edited By: Team Veegam

Apr 27, 2021 | 7:23 PM

DC vs RCB IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...

IPL 2021: 37 బంతులతో తుఫాను సెంచరీ.. విరాట్ కోహ్లీ ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు ఛాన్స్ ఇస్తాడా.?
Mohammed Azharuddeen 1
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బాగా రాణిస్తోంది. ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఒకదానిలో ఓడిపోయి.. నాలుగింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడో స్థానంలో ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇవాళ బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలబడనుంది. ఇప్పటికైనా విరాట్ కోహ్లీ 37 బంతుల్లో సెంచరీ కొట్టిన తన సహచర ఆటగాడిని తుది జట్టులోకి తీసుకుంటాడో.? లేదో.? వేచి చూడాలి.!

ఈ సీజన్ వేలంలో మహ్మద్ అజారుద్దీన్‌ను 20 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అజారుద్దీన్ తన బ్యాట్ ఝుళిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముంబయిపై 54 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 137 పరుగులు చేశాడు. అతను కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది మూడో వేగవంతమైన టీ20 సెంచరీ. 2015 నుండి కేరళ తరపున ఆడుతోన్న అజారుద్దీన్.. ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో 25 మ్యాచ్‌ల్లో 22.55 సగటుతో 451 పరుగులు, 142.27 స్ట్రైక్ రేట్ సాధించాడు. రజత్ పటిదార్ లేదా షాబాజ్ అహ్మద్ లలో ఒకరికి విశ్రాంతిని ఇవ్వాలని కోహ్లీ ఆలోచిస్తే.. అజారుద్దీన్ కు తప్పకుండా ఛాన్స్ దొరుకుతుంది. 

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!