IPL 2021 RCB vs KKR Winner: ఎవరో ఒక్కరే.. గెలిచినా వాళ్లు క్వాలిఫయర్ కు చేరుతారు.. ఓడినవారు ఇంటికే.. ఈ ఉత్కంఠ పోరులో బెంగుళూరు -కోల్ కత్తా మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. ఇక 139 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 6 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, సునీల్ నరైన్ రాణించడంతో ఆ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని క్వాలిఫైయర్-2లో ఢిల్లీతో తలబడనుంది. ఇక ఈ ఓటమితో బెంగళూరు ఇంటి ముఖం పట్టింది.
టాస్ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ గెలవడానికి భారీ స్కోరు అవసరమైనే నేపథ్యంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెంటనే ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి భారీ షాట్‌లతో జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. అయితే వరుస వికెట్‌లు కోల్పోగానే జట్టు స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్‌సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మొదటి నుంచి నెమ్మదిగా ఆడుతూ వచ్చింది. అయితే మధ్యలో వారుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు చేరుకున్న కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :