Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య తీవ్రమైన పోటీ.. ఎవరికీ అందనంత ఎత్తులో హర్షల్ పటేల్.. ఎందులోనో తెలుసా?

IPL 2021లో సీజన్ ముగింపులో అత్యధిక వికెట్లు, పరుగులు తీసిన ఆటగాళ్లకు పర్పుల్, ఆరెంజ్ క్యాప్‌లు ఇవ్వనున్నారు.

IPL 2021: ధావన్, కేఎల్ రాహుల్‌ల మధ్య తీవ్రమైన పోటీ.. ఎవరికీ అందనంత ఎత్తులో హర్షల్ పటేల్.. ఎందులోనో తెలుసా?
Ipl 2021 Purple Cap Orange Cap
Follow us
Venkata Chari

|

Updated on: Sep 23, 2021 | 2:56 PM

IPL 2021 Purple, Orange Cap: ఐపీఎల్ 2021 రెండు వేర్వేరు దశల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా 29 మ్యాచ్‌ల తర్వాత కూడా మొదటి దశ వాయిదా పడింది. దీని తర్వాత రెండో దశ ఆదివారం నుంచి ప్రారంభమైంది. లీగ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి. బుధవారం మరోసారి ఈ లీగ్‌పై కరోనా పంజా విసిరింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈసారి మ్యాచ్ వాయిదా వేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించి, ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న తమ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది.

లీగ్‌తో పాటు, పర్పుల్ క్యాప్ కోసం బౌలర్లు పోటీపడుతున్నారు. సీజన్ ముగింపులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇవ్వనున్నారు. అదే సమయంలో, మొత్తం లీగ్ సమయంలో ప్రతి మ్యాచ్ తర్వాత, ఆ సమయంలో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడి తలపై ఈ టోపీ ఉంటుంది. గత సంవత్సరం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కాగిసో రబాడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అతను 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు.

లీగ్ మొదటి దశ నుంచి ఇప్పటి వరకు, పర్పుల్ క్యాప్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన హర్షల్ పటేల్ తీసుకున్నాడు. లీగ్‌లో తన సత్తా చూపించాడు. బుధవారం తర్వాత పంజాబ్ కింగ్స్‌ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో చేరారు. ఇప్పటికైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ వద్దే పర్సుల్ క్యాప్ ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో అతని ఖాతాలో 17 వికెట్లు ఉన్నాయి. రెండవ దశలో మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌కి వ్యతిరేకంగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్ తర్వాత టాప్ -5 లో మార్పు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రషీద్ ఖాన్ ఐదో స్థానంలో నిలిచాడు.

టాప్ 5 బౌలర్‌ల జాబితా 1. హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- 8 మ్యాచ్‌లు 17 వికెట్లు 2. అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)- 9 మ్యాచ్‌లు 14 వికెట్లు 3. క్రిస్ మోరిస్ (రాజస్థాన్ రాయల్స్)- 8 మ్యాచ్‌లు 14 వికెట్లు 4. అర్షదీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్)- 7 మ్యాచ్‌లు 12 వికెట్లు 5. రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 8 మ్యాచ్‌లు 11 వికెట్లు

ఆరెంజ్ క్యాప్ రేసులో: ఐపీఎల్ 2021 లీగ్‌లో 33 వ మ్యాచ్ మ్యాచ్ బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్‌కు కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ రేసులో మార్పు వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. అతను ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాట్ మరోసారి దుమ్ము దులిపింది. అతను మరోసారి ఆరెంజ్ క్యాప్‌ను స్వాధీనం చేసుకున్నాడు.

అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ఇవ్వనున్నారు. ప్రతి మ్యాచ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఆటగాడికి ఈ టోపీ ఇవ్వనున్నారు. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్ తర్వాత, ఈ రేసులో మొదటి ఐదు పోటీదారుల పేర్లు మారుతూనే ఉన్నాయి. గత సీజన్‌లో, ఈ టోపీ పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ దక్కించుకున్నాడు. అతను 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు.

ఈ సంవత్సరం కూడా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రేసులో ఉన్నారు. అతనితో పాటు పంజాబ్ కింగ్స్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ కూడా టాప్ 5 లో నిలకడగా ఉన్నాడు. మొదటి దశ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో దశలో నాలుగు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ, అతను అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ధావన్ మళ్లీ ఈ టోపీని దక్కించుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు పంజాబ్ కింగ్స్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ కూడా ఈ రేసులో పాల్గొన్నాడు.

ఇది ఆరెంజ్ క్యాప్స్ జాబితాలో టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ 1) శిఖర్ ధావన్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 8 మ్యాచ్‌లు, 422 పరుగులు 2) కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) – 8 మ్యాచ్‌లు, 380 పరుగులు 3) మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్) – 8 మ్యాచ్‌లు 327 పరుగులు 4. ఫాఫ్ డు ప్లెసిస్ (చెన్నై సూపర్ కింగ్స్) – 8 మ్యాచ్‌లు 320 పరుగులు 5) పృథ్వీ షా (ఢిల్లీ క్యాపిటల్స్) – 9 మ్యాచ్‌ల్లో 319 పరుగులు

Also Read: టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

Virat Kohli: విరాట్ కోహ్లీ కెరీర్ కోసం రవిశాస్త్రి సలహా.. పెడచెవిన పెట్టిన టీమిండియా కెప్టెన్

MI vs KKR IPL 2021 Match Prediction: ముంబై సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా..? బలమైన కోల్‌కతా ఎదుట నిలిచేనా..!