- Telugu News Photo Gallery Cricket photos IPL 2021 Sunrisers Hyderabad Kaviya Maran Abuzz on Twitter Again Despite Team Loss vs Delhi Capitals Telugu Cricket News
Sunrisers Hyderabad: ఢిల్లీ మ్యాచ్‌లో ఓడినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నెట్టింట్లో గెలిపించిన మిస్టరీ అమ్మాయి.. ఆమె ఎవరో తెలుసా?
Kaviya Maran: ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన నిరాశపరిచింది. ఇప్పటివరకు ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు.
Updated on: Sep 23, 2021 | 3:37 PM

IPL 2021: ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం ఏడో ఓటమిని చవిచూసింది. లీగ్ 33 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. లీగ్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు వరుస పరాజయాలు పొందడం ఇదే మొదటిసారి.

ఈ ఓటమితో హైదరాబాద్ అభిమానులు ఎంతో బాధపడి ఉంటారు. అయితే, తెరపై మిస్టరీ గర్ల్‌గా ప్రసిద్ధి చెందిన కావ్య మారన్ మరోసారి టీంను సోషల్ మీడియాలో గెలిపించేలా చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ స్టేడియానికి వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతున్నారు. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతూనే ఉన్నారు.

కావ్య మారన్ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె. మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ మేనకోడలు. 28 ఏళ్ల కావ్య మారన్ ఐపీఎల్ 2018 లో మొదటిసారి టీవీలో కనిపించారు. తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్.. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తండ్రి కళానిధి మారన్ వ్యాపారంలో చేరాలని నిర్ణయించుకున్నారు. కావ్య తన కంపెనీలో పెద్ద పదవి చేపట్టే ముందు అనుభవం సంపాదించడానికి సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఇంటర్న్‌షిప్ కూడా చేశారు. కావ్య ప్రస్తుతం సన్ నెక్స్ట్ అధిపతిగా ఉన్నారు. ఇది సన్ టీవీ నెట్‌వర్క్ ఓటీటీ ప్లాట్‌ఫారం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. వారు ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు ఓడిపోయారు. ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచారు. లీగ్‌లో ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ప్రతీ మ్యాచులో గెలవాల్సిందే.





























