PBKS vs RR: ద్రవిడ్ శిష్యుడి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్‌ ఆగమాగం.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా రికార్డు

|

Sep 21, 2021 | 11:23 PM

Arshdeep Singh: మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో అర్షదీప్ 5 వికెట్లతో చెలరేగి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్‌ను ముప్పతిప్పలు పెట్టాడు.

PBKS vs RR: ద్రవిడ్ శిష్యుడి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్‌ ఆగమాగం.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా రికార్డు
Arshdeep Singh
Follow us on

PBKS vs RR: ద్రవిడ్ శిష్యుడు రాజస్థాన్ రాయల్స్‌పై గందరగోళాన్ని సృష్టించాడు. ఐపీఎల్‌లో అలా చేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ రాజస్థాన్ రాయల్స్‌పై విరుచుకుపడ్డాడు. అర్బదీప్ సింగ్ దుబయ్ మైదానంలో రాజస్థాన్‌పై 5 వికెట్లు తీశాడు. అతను ఐపీఎల్‌లో మొదటిసారి ఈ ఘనత సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అర్షదీప్ సింగ్ ఐపీఎల్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అర్షదీప్ సింగ్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అర్ష్‌దీప్ 5/32 ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఎవిన్ లూయిస్, లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగీలను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు, అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో 22 ఓవర్లలో 13 వికెట్లు తీశాడు.

ఈ ఘనత సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు
అర్షదీప్ సింగ్ ఈ ఘనత సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అతను 22 సంవత్సరాల 228 రోజుల వయస్సులో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ రికార్డును అంతకు ముందు జయదేవ్ ఉనద్కట్ సాధించారు. 2013 ఐపీఎల్‌లో 21 సంవత్సరాల 204 రోజుల వయసులో ఢిల్లీపై జయదేవ్ ఈ ఫీట్ చేశాడు. అంకిత్ రాజ్‌పుత్ (5/14), వరుణ్ చక్రవర్తి (5/20), హర్షల్ పటేల్ (5/27) తర్వాత లీగ్‌లో క్యాప్ చేయని భారతీయుడు చేసిన నాలుగో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

ఐపీఎల్ 2021 లో ఐదు వికెట్లు తీసిన బౌలర్లు
హర్షల్ పటేల్ vs ముంబై ఇండియన్స్
ఆండ్రీ రస్సెల్ vs ముంబై ఇండియన్స్
అర్షదీప్ సింగ్ vs రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐదు వికెట్లు తీసిన బౌలర్లు
డి మస్కరేన్హాస్ vs పూణే వారియర్ ఇండియా (2012)
అంకిత్ రాజ్‌పుత్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (2018)
అర్ష్ దీప్ సింగ్ vs రాజస్థాన్ రాయల్స్ (2021)

ద్రవిడ్ శిష్యుడు..
అర్షదీప్ జీవితాన్ని మార్చిన క్షణం 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో, అతను జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. ఈ సమయంలో ద్రవిడ్.. అర్షదీప్ స్ఫూర్తిని బాగా పెంచాడు. ఐపీఎల్ 2019 వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అర్షదీప్‌ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. మొదటి సీజన్‌లో, అతను మూడు మ్యాచ్‌లలో మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ, 2020 ఐపీఎల్‌లో అతనికి పూర్తి అవకాశం లభించింది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరు మీద తొమ్మిది వికెట్లు ఉన్నాయి.

పంజాబ్ శిబిరంలో మరింత రాటు దేలాడు..
పంజాబ్‌ క్యాంప్‌లో అర్షదీప్.. మహమ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్ వంటి లెజెండరీ బౌలర్ల నుంచి ఎంతో నేర్చుకున్నాడు. ఐపీఎల్ 2020 కి సంబంధించి, గత నాలుగు నెలలు తనకు కలలాంటివని అర్షదీప్ పేర్కొన్నాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అనిల్ కుంబ్లే నుంచి నేర్చుకునే అవకాశం నాకు లభించిందని తెలిపాడు.

Also Read: PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

PBKS vs RR, IPL 2021 Live: 15 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 148/2.. కేఎల్ పూరన్ 12, మక్రాం 12 పరుగులతో బ్యాటింగ్