IPL 2021 MI vs DC Live Streaming: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం.. ముంబయి ఎగబాకేనా? ఢిల్లీ ఊపును కొనసాగించేనా.?

|

Oct 02, 2021 | 7:21 AM

IPL 2021 MI vs DC Live Streaming: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. నిజానికి ఈ సీజన్‌ ఇప్పటికే ముగియాల్సి ఉండగా.. ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్‌లను వాయిదా వేశారు. పరిస్థితులు..

IPL 2021 MI vs DC Live Streaming: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం.. ముంబయి ఎగబాకేనా? ఢిల్లీ ఊపును కొనసాగించేనా.?
Follow us on

IPL 2021 MI vs DC Live Streaming: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. నిజానికి ఈ సీజన్‌ ఇప్పటికే ముగియాల్సి ఉండగా.. ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మ్యాచ్‌లను వాయిదా వేశారు. పరిస్థితులు మళ్లీ మెరుగుపడడంతో తిరిగి రెండో విడత మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రెండో ఫేస్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లలో టీమ్‌లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 మ్యాచ్‌లకు గాను 9 గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది.

ఇక నేడు (శనివారం) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జాలోని షార్జా క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. పాయింట్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ముంబయి ఎగబాకడానికి ప్రయత్నిస్తుంటే.. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలుపొంది చెన్నైకి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. మరి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఇంతకీ మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి.? మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభం కానుంది లాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మ్యాచ్‌ ఎప్పుడు ఎక్కడ జరగనుందంటే..

ఈ సీజన్‌లో జరుగుతోన్న 46వ మ్యాచ్‌ అయిన ముంబయి ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ అక్టోబర్‌ 2 (శనివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

మ్యాచ్‌ను ఎక్కడ వీక్షించవచ్చు..

ఈ మ్యాచ్ స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్‌ను చూడాలనుకునే వారు హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

జట్టు సభ్యుల విషయానికొస్తే..

ముంబయి టీమ్‌ విషయానికొస్తే.. ఈరోజు జరిగే మ్యాచ్‌లో కొందరు ప్లేయర్స్‌ గాయాల కారణంగా తుది జట్టులో మార్పులు చేర్పులు జరగనున్నాయి. సూర్యకుమార్‌ యాద్‌, ఇషాన్‌ కిషాన్‌లో ఎవరో ఒకరు జట్టులో చోటు సంపాదించుకోనున్నారు. అలాగే నాథన్‌, జయంత్‌ యాదవ్‌లలో ఎవరు మైదానంలోకి అడుగుపెట్టనున్నారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ముంబయి ఇండియన్స్‌:

రోహిత్‌ శర్మ (క్యాప్టెన్‌), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌/ ఇషాన్‌ కిషాన్‌, సౌరభ్‌ తివారీ, హార్ధిక్‌ పాండియా, కీరన్‌ పొలార్డ్‌, కర్నల్‌ పాండ్యా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌/జయంత్‌ యాదవ్‌, రాహుల్‌ చహార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోన్నా.. అన్రిచ్‌ నార్ట్జే, అమిత్‌ మిశ్రాలో చివరికి చోటు దక్కించుకునేది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్‌:

స్టీవ్‌ స్మిత్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), షీమ్రాన్‌ హెట్మయర్‌, లలిత్‌ యాదవ్‌, ఆక్సర్‌ పటేల్‌, అశ్విన్‌, కగిసో రబడా, అన్రిన్‌ నార్ట్జే/అమిత్‌ మిశ్రా, అన్వేష్‌ ఖాన్‌.

Also Read: Crime News: నడిరోడ్డుపై బైక్ పార్కింగ్.. తీయాలన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. కిందపడేసి దారుణంగా..

Japanese Princess: ప్రేమ కోసం త‌న వార‌స‌త్వ భారీ సంప‌ద‌ను వ‌దులుకొని పెళ్లిపీటలెక్కబోతోన్న జపాన్ యువరాణి

Jai Bheem Suriya: మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ అమెజాన్‌లో వచ్చేస్తోంది.. సూర్య ‘జై భీమ్‌’ విడుదల ఎప్పుడంటే..