IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్.? స్వదేశానికి వెళ్లిపోనున్న వార్నర్.!

| Edited By: Team Veegam

Apr 27, 2021 | 7:20 PM

ఐపీఎల్ 14కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వరుసపెట్టి స్వదేశానికి క్యూ కట్టారు...

IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్.? స్వదేశానికి వెళ్లిపోనున్న వార్నర్.!
Ipl Gallery David Warner
Follow us on

ఐపీఎల్ 14కు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ వరుసపెట్టి స్వదేశానికి క్యూ కట్టారు. ప్రస్తుతం భారత్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్లాలని చూస్తున్నారట. ఇప్పటికే చాలామంది ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి పయనం కాగా.. సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. అంతకుముందు, ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. వీరిలో కెన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై ఉన్నారు.

వాస్తవానికి, 9 న్యూస్ నివేదికల ప్రకారం, ఆస్ట్రేలియా సరిహద్దులు మూసివేయడానికి ముందే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా ఐపీఎల్లోని వ్యాఖ్యాతలుగా ఉన్న ఆటగాళ్ళు, కోచ్‌లు వెరిసి 30 మంది స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారట. కాగ్, ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇండియా నుంచే విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, డేవిడ్ వార్నర్ వెళ్లడం నిజమైతే.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!