IPL మొదటి ఎడిషన్ 2008 సంవత్సరంలో జరిగింది. ఈ సీజన్‌లో షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ టీం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే ధోనీ-కోహ్లీ నుంచి సచిన్-మెక్‌గ్రాత్ వంటి ఆటగాళ్లు మొదటి సీజన్‌కు ఎంత డబ్బు సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం.
2008 ఐపీఎల్ వేలంలో మహేంద్ర సింగ్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.5 కోట్లు వెచ్చించి మహేంద్ర సింగ్ ధోనీని తమ జట్టులో చేర్చుకుంది. అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్ 2016, 2017లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కాలేదు. ఎందుకంటే ఆ రెండు సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై వేటు వేశారు. ఇక బెంగళూరు టీం కేవలం రూ.20 లక్షలు ఖర్చు చేసి విరాట్ కోహ్లీని దక్కించుకుంది.
2008 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ సచిన్ టెండూల్కర్ కోసం దాదాపు రూ. 8 కోట్లు వెచ్చించింది. అయితే ఐపీఎల్ తొలి సీజన్‌లో సచిన్ టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్. అదే సమయంలో ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆస్ట్రేలియా వెటరన్ గ్లెన్ మెక్‌గ్రాత్ రూ.1 కోటి 71 లక్షలు అందుకున్నాడు. ఆ సీజన్‌లో, గ్లెన్ మెక్‌గ్రాత్ ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగంగా ఉండగా, మాజీ ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ రూ. 1.60 కోట్లు అందుకున్నాడు. రికీ పాంటింగ్ IPL మొదటి సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత అతను ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..