IPL 2023: ఖర్చుల కోసం పానీ పూరి అమ్మాడు.. కట్ చేస్తే 4 కోట్లతో అదరగొడుతోన్న 21 ఏళ్ల కుర్రాడు

|

Apr 27, 2023 | 9:25 AM

IPL 2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ధోనీపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనికి ఇష్టమైన ఓ 21 ఏళ్ల కుర్రాడు అతనికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు.

IPL 2023: ఖర్చుల కోసం పానీ పూరి అమ్మాడు.. కట్ చేస్తే 4 కోట్లతో అదరగొడుతోన్న 21 ఏళ్ల కుర్రాడు
Yashasvi Jaiswal
Follow us on

IPL 2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ధోనీపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనికి ఇష్టమైన ఓ 21 ఏళ్ల కుర్రాడు అతనికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. అతనే 21 ఏళ్ల యశస్వి జైస్వాల్‌. రాజస్థాన్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ఈ ప్లేయర్‌ ధనాధాన్‌ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచుల్లో వరుసగా 54, 11, 60, 10,1, 44, 47 పరుగులు చేశాడు. అండర్‌- 19 ప్రపంచకప్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన ఈ కుర్రాడు 2020లో రాజస్థాన్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే తనకు ఇష్టమైన ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఆడే అద్భుత అవకాశం లభించింది. అప్పటితో మొదలైన యశస్వి ఐపీఎల్ ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. ఈ రాజస్థాన్ బ్యాటర్‌ తన మొదటి IPL హాఫ్ సెంచరీని కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌పైనే చేయడం గమనార్హం. అక్టోబర్ 2021లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు యశస్వి.

అయితే యశస్వి ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. పేదరికం, ఆర్థిక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 11 సంవత్సరాల వయస్సులో క్రికెట్ కోసం ముంబైకి వచ్చిన అతను 3 ఏళ్ల పాటు డేరాల్లో నివాసమున్నాడు. ఖర్చుల కోసం రోడ్లపై పానీపూరి కూడా అమ్మాడు. పగలు క్రికెట్‌ కోచింగ్‌ తీసుకుంటూ రాత్రి వేళల్లో ఏదో ఒక పని చేసేవాడు. యశస్వి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు దక్కింది. అండర్ 19 ప్రపంచ కప్ 2020లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో రాజస్థాన్ రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా సీజన్‌లో ఏకంగా రూ. 4 కోట్లు పెట్టి మరీ ఈ కుర్రాడిని దక్కించుకుంది రాజస్థాన్‌ ఫ్రాంచైజీ. సో.. ఇవాళ మరోసారి తన అభిమాన క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు యశస్వి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..