Virat and Anushka: ముంబైలోని కోహ్లీ హాలిడే హోమ్‌ను చూసారా? సౌకర్యాలను చూస్తే వావ్ అనాల్సిందే!

|

Jan 15, 2025 | 8:46 PM

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ. 32 కోట్ల విలువైన అలీబాగ్ విల్లాను నిర్మించారు. ఇది 8 కోట్ల రూపాయల విలువగల స్థలంలో విశాలమైన ఆర్కిటెక్చర్, ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. కోహ్లీ క్రికెట్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, వారి వ్యక్తిగత జీవనశైలి ఆకర్షణగా మారింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న ఈ జంట తమ ప్రత్యేక శైలితో అందరి మనసును గెలుచుకుంటోంది.

Virat and Anushka: ముంబైలోని కోహ్లీ హాలిడే హోమ్‌ను చూసారా? సౌకర్యాలను చూస్తే వావ్ అనాల్సిందే!
Virat Kohli
Follow us on

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల విలాసవంతమైన జీవనశైలి మరొకసారి వార్తల్లో నిలిచింది. ఈ జంట రూ. 32 కోట్ల ఖరీదైన హాలిడే హోమ్‌ను అలీబాగ్‌లో నిర్మించుకున్నారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. టెంపరేచర్ కంట్రోల్డ్ పూల్, బెస్పోక్ కిచెన్( ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం నిర్మించింది), నాలుగు బాత్‌రూమ్‌లు, విశాలమైన గార్డెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలు ఆవిష్కరించి.

2022లో రూ. 19 కోట్లతో కొనుగోలు చేసిన ఈ ఆస్తి నిర్మాణానికి కోహ్లీ రూ. 10.5 కోట్ల నుండి రూ. 13 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇటాలియన్ పాలరాయి, సహజ రాళ్ళు, టర్కిష్ సున్నపురాయి వంటి అత్యంత విలాసవంతమైన మెటీరియల్స్‌ను ఉపయోగించి, ఈ ఇంటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌లో తమ పర్ఫార్మెన్స్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం నూతన మైలురాళ్ళను చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట ముంబైలో రూ. 34 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తున్నారు, అలాగే గురుగ్రామ్‌లో కోహ్లీకి రూ. 80 కోట్ల విలువైన బంగ్లా కూడా ఉంది.

క్రికెట్ ప్రదర్శనల విషయంలో కొంత ఆత్మవిమర్శ అవసరమైనప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కోహ్లీ-అనుష్క తమ శైలిని నిర్ధారించుకుంటున్నారు. ఇది వారికి అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తోంది.