BCCI: దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుంది.. తేల్చి చెప్పిన బీసీసీఐ..

|

Nov 30, 2021 | 8:46 PM

కరోనా కొత్త వేరియంట్ ఆందోళన మధ్య భారత్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటనపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మంగళవారం స్పందించారు. సౌతాఫ్రికాలో ఇండియా పర్యటిస్తుందని తేల్చిచెప్పారు...

BCCI: దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుంది.. తేల్చి చెప్పిన బీసీసీఐ..
Bcci
Follow us on

కరోనా కొత్త వేరియంట్ ఆందోళన మధ్య భారత్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మంగళవారం స్పందించారు. సౌతాఫ్రికాలో ఇండియా పర్యటిస్తుందని తేల్చిచెప్పారు. ముంబైలో న్యూజిలాండ్‌తో భారత్ చివరి టెస్ట్ ఆడుతుందని, అక్కడ నుంచి డిసెంబర్ 8 లేదా 9 న భారత జట్టు చార్టర్డ్ విమానంలో జోహన్నెస్‌బర్గ్‌కు బయలుదేరుతుందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా సృష్టించిన బయో బబుల్ వాతావరణం ఆటగాళ్లను సురక్షితంగా ఉంచుతుందని ధుమాల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. డిసెంబరు 17 నుంచి జోహన్నెస్‌బర్గ్‌లో భారత్ మొదటి టెస్ట్ ఆడనుంది. ” మేము ఆటగాళ్ల భద్రతపై రాజీపడము. ప్రస్తుతానికి మాకు చార్టర్డ్ ఫ్లైట్ ఉంది. షెడ్యూల్ ప్రకారం జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్తారు. ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉంటారు” అని ధుమాల్ PTI కి చెప్పారు.

ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణాఫ్రికాలోని వేదికల మార్పుపై ధుమాల్ ఇలా అన్నాడు: “మేము క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA) అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. సిరీస్‌లో రాజీ పడకుండా ఉండటానికి మేము చేయగలిగినదంతా మేము ప్రయత్నిస్తాము. కానీ పరిస్థితి తీవ్రతరం అయితే మా ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం పట్ల రాజీ పడం. భారత ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.” అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణంపై నిషేధాన్ని విధించాయి. కానీ భారతదేశం ఆ పని చేయలేదు. అయితే, భారత ప్రభుత్వం యొక్క సవరించిన మార్గదర్శకాల ప్రకారం దక్షిణాఫ్రికా “ప్రమాదంలో ఉన్న” దేశాలలో ఒకటి. అని ధుమాల్ చెప్పాడు.

ఇప్పటికే భారత్ A జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా భారత క్రికెట్ జట్టు కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. సిరీస్ కోసం ఇక్కడకు వచ్చిన భారత జట్టకు “పూర్తి బయో-సురక్షిత వాతావరణం” కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడుతుంది.

Read Also.. IPL 2022 Retention Players List: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్లు వీరే? కేఎల్ రాహుల్‌కు షాకిచ్చిన పంజాబ్.. పూర్తి జాబితా ఇదిగో..!