సమయం ఆసన్నమైంది. వచ్చే నెలలో వెస్టిండీస్, యూఎస్ఏలలో సంయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్‌కప్‌కి టీమిండియా జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. ఐపీఎల్ పెర్ఫార్మన్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారా.? లేదా అంతర్జాతీయ అనుభవాన్ని లెక్కలోకి తీసుకుంటారా.? అసలు స్క్వాడ్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు. అయితే ఓ నలుగురు ప్లేయర్స్‌కి అసలు ఛాన్స్ ఉండదని తెలుస్తోంది. ఇంతకీ ‘ఆ నలుగురు’ ఎవరు ఇప్పుడు తెలుసుకుందామా..
కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సర్‌ప్రైజ్ నేమ్స్ ఏవీ లేకపోగా.. అందరూ అనుకున్నట్టుగానే పేలవ ఫామ్ కొనసాగిస్తున్న హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎంపిక చేయనున్నారట. అయితే అనూహ్యంగా కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లకు మొండిచెయ్యి చూపించనున్నారట సెలెక్టర్లు. ఫస్ట్ ఛాయస్ వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్.. అలాగే సెకండ్ ఛాయస్‌గా ధృవ్ జురెల్, జితేష్ శర్మలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందట. వైస్ కెప్టెన్‌గా పంత్ ముందు వరుసలో ఉండగా.. హార్దిక్ పాండ్యా తన పేలవ ఫామ్‌తో వెనకడుగు వేసాడట. శుభ్‌మాన్ గిల్, యుజ్వేంద్ర చాహల్, ఫినిషర్ రింకూ సింగ్‌లకు బెర్త్ కష్టమేనని అంటున్నారు.
టాప్ 4 స్పాట్స్‌లో రోహిత్ శర్మ, యశ్వసి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దాదాపుగా ఖరారు కాగా.. రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో గిల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్‌లు ఉంటారట. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ కన్ఫర్మ్ అయ్యారట. స్వింగ్ బౌలర్ల విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ ఉన్నారట.
MS Dhoni 🤝 World Cup Trophy
Made for each other❤️
📌 BCCI HQ | @msdhoni | #TeamIndia pic.twitter.com/4Bak4bG7pA
— BCCI (@BCCI) April 13, 2024