IND Vs NZ: ‘కావాలనే ఇలా చేశాము.. మంచి గుణపాఠం అయింది’.. ఓటమిపై స్కై ఫస్ట్ రియాక్షన్ ఇదే

వైజాగ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్నందున, టీమిండియా ఈ మ్యాచ్‌ను ప్రయోగాలకు వేదికగా ఉపయోగించుకుంది. అయినప్పటికీ, శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది.

IND Vs NZ: కావాలనే ఇలా చేశాము.. మంచి గుణపాఠం అయింది.. ఓటమిపై స్కై ఫస్ట్ రియాక్షన్ ఇదే
Surya Kumar Yadav

Updated on: Jan 29, 2026 | 8:24 AM

వైజాగ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. సొంత గడ్డపై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో పలు ప్రయోగాలకు దిగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్-మ్యాచ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న ప్రకారం, జట్టు ఒక బ్యాట్స్‌మెన్‌ను తగ్గించుకుని, ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత 180-200 లక్ష్యాన్ని ఛేదించాలనే ఇలా చేశామని చెప్పాడు. మొదట బ్యాటింగ్‌లో అద్భుతాలు చేశాం. ఒకవేళ 180 లేదా 200 చేజ్ చేయాలనుకున్నప్పుడు రెండు లేదా మూడు వికెట్లు కోల్పోతే మిగిలిన బ్యాటర్లు ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది ఆలోచించాం. ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్న ఆటగాళ్ల అందరికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నాం. ఇట్స్ ఏ గుడ్ చాలెంజ్. మళ్లీ అవకాశం వస్తే ఈసారి చేజ్ చేస్తాం. గుణపాఠం నేర్చుకున్నాం’ అని సూర్య అన్నాడు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

న్యూజిలాండ్ 215 పరుగులు చేయగా, భారత్ ఛేదనలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. శివమ్ దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి అద్భుతమైన పోరాటం కనబరిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ తరపున టిమ్ సైఫర్ట్, డెవాన్ కాన్వే బలమైన భాగస్వామ్యం నెలకొల్పగా, మిచెల్ సాంట్నర్ అద్భుతమైన బౌలింగ్ (3/26)తో రాణించాడు. ఈ ఓటమి టీ20 ప్రపంచ కప్ ముందు జట్టుకు కొన్ని పాఠాలను నేర్పింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..