హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్‌ వెనుక అసలు కారణం ఇదేనంట..! వెల్లడించిన కోచ్ పవన్ సేన్

| Edited By: Venkata Chari

Jul 11, 2021 | 6:11 PM

Harleen deol: భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్లీన్ డియోల్.. ఒక్క క్యాచ్‌తో స్టార్‌గా మారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీ దగ్గర అద్భుత రివర్స్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించింది.

హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్‌ వెనుక అసలు కారణం ఇదేనంట..! వెల్లడించిన కోచ్ పవన్ సేన్
Harleen Deol
Follow us on

Harleen deol: భారత మహిళా క్రికెట్ ప్లేయర్ హర్లీన్ డియోల్.. ఒక్క క్యాచ్‌తో స్టార్‌గా మారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీ దగ్గర అద్భుత రివర్స్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించింది. అయితే, ప్రస్తుతం ఈ క్యాచ్‌ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అలాగే సచిన్ టెండూల్కర్ నుంచి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ వరకు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏడేళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించిన హర్లీన్ డియోల్.. ఎనిమిదేళ్ల వయసులో అండర్-19 ఇంటర్ స్కూల్ మ్యాచ్ ఆడింది. 2010లో ఆమె పంజాబ్ అండర్-19 జట్టులో భాగమైంది. తొలినాళ్లలో డియోల్ ఆఫ్ స్పిన్నర్‌గా ఉండేది. అనంతరం లెగ్ స్పిన్నర్‌గా మారిపోయింది. హర్లీన్ డియోల్ మొదట్లో డైవ్ చేసేందుకు చాలా భయపడేదంట. కానీ, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డైవ్‌లు చేసేందుకు ఉత్సాహం చూపించిందంట. ఇక్కడే తన భయం పోయిందంట. హెచ్‌పీసీఏ అకాడమీ కోచ్ పవన్ సేన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు.

పవన్ మాట్లాడుతూ.. ‘హర్లీన్ డియోల్ మొదట్లో డైవ్, స్లైడ్ చేసేందుక చాలా భయపడేది. తడి పిచ్ కవర్లపై స్లైడ్, డైవ్ చేయడం నేర్పేందుకు మేము హెచ్‌పీసీఏ అకాడమీలో శిక్షణ ఇప్పించాము. ఇది ఆమెకు చాలా హెల్స్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్‌ కూడా ఇక్కడే రాటుదేలింది. ప్రస్తుతం తెలివైన ఫీల్డర్‌గా ప్రశంసలు పొందుతోందని, ఇది ఆమె ఆనాడు చేసిన కృషి ఫలితంగా దక్కిందని’ వెల్లడించారు. ఆమె క్రికెట్‌పై ఎంతో శ్రద్ధపెట్టేదని, ప్రాక్టీస్‌లో లీనమయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఓ సారి హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన వేలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. అనంతరం డియోల్ తల్లి ఈ గాయంపై మాకు సమాచారం అందించిందని తెలిపాడు. అలా క్రికెట్‌పై ఎంతో ప్రేమచూపేదని వెల్లడించాడు.

ఆమె తల్లి చరంజిత్ కౌర్ మాట్లాడుతూ, ‘ హర్లీన్ డియోల్ ఏడేళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించింది. ఆమె విరిగిన వేలితో యాద్విందర్ పబ్లిక్ గ్రౌండ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌తో ఆడుతున్నప్పుడు గాయం అయింది. అలాగే గాయడిన వేలితో బౌలింగ్ చేసింది. ప్రస్తుత క్యాచ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి వాళ్ల దగ్గరనుంచి ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉందని, ఇతంతా ఆనాటి కష్టానికి ఫలితమేనని’ పేర్కొంది.

Also Read:

టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ఓపెనింగ్ చేసేది వీరేనంట: ప్రకటించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ బ్రాడ్ హగ్!

India vs England: ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ ఫాం చాలా కీలకం: టీమిండియా మాజీ క్రికెటర్ రితేందర్