T20 Cricket: ఒకే ఓవర్లో 34 పరుగులు.. 5 సిక్స్‌లు.. ఒక ఫోర్.. భారత సంతతి బౌలర్‌ను చెడుగుడు ఆడుకున్న బ్యాటర్ ఎవరంటే..
మైనర్ లీగ్ క్రికెట్ ఆఫ్ అమెరికా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ లీగ్‌లో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. భారత్‌ను అండర్-19 ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) కూడా ఈ క్రికెట్ లీగ్‌లోనే ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ లో..
మైనర్ లీగ్ క్రికెట్ ఆఫ్ అమెరికా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ లీగ్‌లో ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఆడుతున్నారు. భారత్‌ను అండర్-19 ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) కూడా ఈ క్రికెట్ లీగ్‌లోనే ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ మరోసారి వార్తల్లో కొచ్చింది. శుక్రవారం జరిగిన ఓ మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన ఫాస్ట్ బౌలర్ ఒకే ఓవర్లో 34 పరుగులు సమర్పించుకున్నాడు. చికాగో టైగర్స్ తరఫున ఆడుతున్న కాల్విన్ సావేజ్ మోహిత్ పటేల్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతను వేసిన 19 ఓవర్లో 5 సిక్స్‌లు, ఒక బౌండరీ బాది మొత్తం 34 పరుగులు రాబట్టుకున్నాడు. తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదిన కెల్విన్ మూడో బంతిని బౌండరీగా మలిచాడు. ఆ తర్వాత చివరి 3 బంతులను కూడా నేరుగా స్టేడియంలోకి పంపించాడు. ఈమ్యాచ్‌లో మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న సావేజ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి అర్ధసెంచరీ చేసే అవకాశం ఉన్నా చివరి ఓవర్‌లో సరిగా స్ట్రైక్ రాలేదు. దీంతో 49 పరుగుల దగ్గరే ఆగిపోయాడు.
Calvin Savage ABSOLUTELY SMASHED the 19th over ???
ఇక మ్యాచ్ విషయానికొస్తే..తొలుత బ్యాటింగ్ చేసిన చికాగో టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. అనంతరం చికాగో బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసి 9 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. చికాగో టైగర్స్ తరఫున కరణ్ కుమార్ 53, మనన్ పటేల్ 43 పరుగులు చేశారు. అయితే కాల్విన్ సావేజ్ 49 పరుగుల ఇన్నింగ్సే ఈ మ్యాచ్లో హైలెట్. అదే మ్యాచ్‌ను మలుపుతిప్పింది. అందుకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం కూడా అతనికే లభించింది.
Calvin Savage is looking to cement himself in the #MinorLeagueCricket history books ? ? What an absolutely amazing over to watch ?