Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ క్రికెటర్ ప్రేమలో పడ్డాడా? అందమైన అమ్మాయితో కలిసి షికార్లు.. వీడియో వైరల్

|

Sep 11, 2024 | 5:35 PM

యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ జట్టు భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. త్వరలోనే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కూడా ఈ ప్లేయర్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో నూ రాణించి టీమ్ ఇండియాలో తన స్థానాన్నిసుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు జైస్వాల్. తన దూకుడైన బ్యాటింగ్ తో ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన ఓపెనర్‌గా కనిపిస్తున్నాడీ యంగ్ క్రికెటర్

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ క్రికెటర్ ప్రేమలో పడ్డాడా? అందమైన అమ్మాయితో కలిసి షికార్లు.. వీడియో వైరల్
Yashasvi Jaiswal
Follow us on

యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ జట్టు భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. త్వరలోనే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కూడా ఈ ప్లేయర్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ లో నూ రాణించి టీమ్ ఇండియాలో తన స్థానాన్నిసుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడు జైస్వాల్. తన దూకుడైన బ్యాటింగ్ తో ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన ఓపెనర్‌గా కనిపిస్తున్నాడీ యంగ్ క్రికెటర్. కాగా క్రికెట్ కు సంబంధించిన విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే జైస్వాల్ ఇప్పుడు ఓ వేరే కారణాలతో వైరల్ అవుతున్నాడు. ఒక విదేశీ అమ్మాయితో కలిసి అతను చక్కర్లు కొడుతోన్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్నది జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఈ బ్యూటీ పేరు మ్యాడీ  హమిల్టన్. వీరిద్దరూ గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. హామిల్టన్ బ్రిటన్అమ్మాయి. అయితే ప్రస్తుతం ఇండియాలోనే చదువుకుంటోంది. గతంలో పలుసార్లు టీమిండియా మ్యాచ్ లకు ఆమె హాజరైంది. గ్యాలరీలో కూర్చొని జైస్వాల్ తో పాటు టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది.

కాగా తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి జైస్వాల్ కానీ, హమిల్టన్ కానీ ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. అయితే వీరిద్దరూ కలిసి ఉన్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాడీ హామిల్టన్ IPL 2024లో యశస్వి జైస్వాల్ ఆడే మ్యాచ్ లకు హాజరైంది. బయట కూడా ఇద్దరు చాలా సార్లు జంటగానే కనిపించారు. మ్యాడీ హామిల్టన్ సోదరుడు హెన్రీ యశస్వి జైస్వాల్‌కి మంచి స్నేహితుడని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించాడు . ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 2024 లో 15 మ్యాచ్‌లు ఆడిన యశస్వి 453 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 68.53 సగటుతో 9 మ్యాచ్‌లు ఆడిన యశస్వి 1028 పరుగులు చేశాడు. 214 అత్యధిక వ్యక్తిగత స్కోరు. కాగా త్వరలోనే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27న జరగనుంది. ఈ సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌తో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

  హమిల్టన్ తో కలిసి తిరుగుతోన్న జైస్వాల్.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..