Dont Rush Challenge: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ ట్రెండింగ్‌లో నిలుస్తూనే ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన బకెట్ ఛాలెంజ్ నుంచి ఇటీవలి కాలంలో వచ్చిన ‘మేకప్ నో మేకప్ లుక్స్’ వరకు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం ఈ ఛాలెంజ్‌లలో పాల్గొనడంతో బాగా పాపులర్ అవుతున్నాయి. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ అభిమానులకు కనుల విందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘డోన్ట్ రష్’ అనే కొత్త ఛాలెంజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ ప్రైవేటు ఆల్బమ్ ‘డోన్ట్ రష్’ రీమిక్స్ వెర్షన్‌కు కాలు కదపడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను చాలా మంది సెలబ్రిటీలు స్వీకరించగా తాజాగా టీమిండియా ఆటగాడు హార్థిక పాండ్యా పాటకు తగ్గట్లు స్టెప్పులేశాడు. భార్య నటాశా స్టాంకోవిక్, కుమారుడుతో కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ముంబయి ఇండియన్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ‘క్యూట్ విభాగంలో మాకు ఒక ఎంట్రీ ఉంది’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Actress Anjali: నేను రూల్స్ విధిగా పాటిస్తాను.. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హీరోయిన్ అంజలి
Yusuf Pathan: సచిన్ తర్వాత.. యూసఫ్ పఠాన్‌కు కరోనా పాజిటివ్.. ఆ టోర్నీలో పాల్గొన్న వారిలో కలవరం