దూల తీరిందా రోహిత్ భయ్యా.. టాస్ గెలిచి, మరీ చెత్త నిర్ణయాలు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావంటూ ఫ్యాన్స్ ఫైర్..

Rohit Sharma: ఈ మ్యాచ్ పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ మొత్తం 37 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న జట్టు 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, గణాంక కోణం నుంచి చూస్తే, మొదట బ్యాటింగ్ చేయాలనే రోహిత్ నిర్ణయం టీమిండియాపై భారంగా మారింది.

దూల తీరిందా రోహిత్ భయ్యా.. టాస్ గెలిచి, మరీ చెత్త నిర్ణయాలు.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావంటూ ఫ్యాన్స్ ఫైర్..
Asia Cup 2023 Toss Rohit Sh

Updated on: Sep 02, 2023 | 4:32 PM

IND vs PAK: ఆసియా కప్-2023లో శనివారం పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్‌లో టాస్ చాలా ముఖ్యం. మ్యాచ్ ఏ జట్టు వైపు వెళ్తుందనేది టాస్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రతి జట్టు కెప్టెన్ టాస్ గెలవాలని కోరుకుంటాడు. తద్వారా అతను తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. టాస్ గెలిచిన తర్వాత రోహిత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతని నిర్ణయం సరైనది కాదని తేలింది.

దీనికి సంబంధించిన డేటాను చూసే ముందు, గత రెండు రోజులుగా పల్లెకెలెలో వర్షాలు కురుస్తున్న సంగతిని మర్చిపోయారా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది మ్యాచ్‌పై కూడా ప్రభావం చూపుతుంది. మ్యాచ్‌కు ముందు వర్షం పడింది. మ్యాచ్ సమయంలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్ సరదా చెడిపోతుందనే భయం నెలకొంది. ఒక్కసారి వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్‌ను నిలిపివేసింది. వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5.2 ఓవర్లు మాత్రమే ఆడారు. ఆ తర్వాత వెంటవెంటనే టీమిండియా రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో కూరుకపోయింది. కీలకమైన రెండు వికెట్లను పవర్ ప్లే సమయంలో కోల్పోవడంతో పెద్ద దెబ్బ తగనుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గణాంకాలు ఇలా ఉన్నాయి..

ఈ మ్యాచ్ పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే.. ఇక్కడ మొత్తం 37 వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న జట్టు 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, గణాంక కోణం నుంచి చూస్తే, మొదట బ్యాటింగ్ చేయాలనే రోహిత్ నిర్ణయం టీమిండియాపై భారంగా మారింది.

బ్యాడ్ వెదర్..


ఈ మ్యాచ్‌లో వర్షం నీడ ఉంది. మ్యాచ్ ప్రారంభంలో వర్షం కురిసిందని, మధ్యలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడినప్పుడు రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. వర్షం పడితే డక్‌వర్త్ లూయిస్ నిబంధన వర్తిస్తుంది. ఇందులో రెండో ఇన్నింగ్స్ ఆడే జట్టు పాకిస్థాన్‌కు సులువుగా ఉంటుంది. వర్షం పడితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బంతిని పట్టుకోవడంలో, ఫీల్డింగ్‌లో కూడా ఇబ్బంది పడవచ్చు. ఇలాంటి విషయాలు మర్చిపోయి, బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటంటూ కెప్టెన్ నిర్ణయంపై తిట్ల దండకం అందుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..