భారత జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. అయితే, ఇదే విషయమై మాజీల నుంచి మీడియా వరకు బీసీసీఐ నిర్ణయాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ఇంగ్లిష్ న్యూస్ పేపర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ఎట్టకేలకు ఈ విషయంపై పెదవి విప్పాడు. ఈ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాను. నా భార్యతోనూ ఇదే విషయం చెప్పాను. ఆస్ట్రేలియా సిరీస్ నా కెరీర్‌కు లాస్ట్‌ది ఛాన్స్ ఉందని చెప్పేశాను. మెకాలి గాయంతో బౌలింగ్ యాక్షన్‌లోనూ మార్పులు చేసుకోవాలని అనుకుంటున్నట్లు కూడా నా భార్యకు చెప్పాను’ అంటూ వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే, బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన బౌలింగ్ యాక్షన్ మార్చుకుని, పాత పద్ధతికి తిరిగి వచ్చానని, అది తనకు లాభించిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
నాలుగు-ఐదేళ్లుగా బౌలింగ్ యాక్షన్‌ని మార్చడం మంచిది కాదని అశ్విన్‌కు తెలుసు. అయితే అతను తన మోకాలిపై ఎక్కువ ఒత్తిడి చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
In case you have been missing R Ashwin bowling at The Oval with a red ball: pic.twitter.com/nsLxR0XsMo
— Shafqat Shabbir (@Chefkat23) June 7, 2023
మెకాలి నొప్పిని అదుపులో ఉంచుకునేందుకు అశ్విన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. బెంగళూరు వెళ్లి పాత యాక్షన్‌తో బౌలింగ్ చేయడం ప్రారంభించానని, ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు పోయాయని చెప్పుకొచ్చాడు. నాగ్‌పూర్‌లో మూడు-నాలుగు రోజులు ప్రాక్టీస్ చేశానని, ఆపై మ్యాచ్‌లో మారిన యాక్షన్‌తో బౌలింగ్ చేశానని అశ్విన్ ప్రకటించాడు. తొలిరోజు మూడు-నాలుగు ఓవర్లు వేసిన తర్వాత తాను బౌలర్‌ని కానని భావించానని, అయితే క్రమంగా అంతా సవ్యంగా సాగిందని అశ్విన్ అన్నాడు.
.@sachin_rt is baffled by the decision of not fielding R Ashwin in the #WTC2023Final. pic.twitter.com/rupUkGloAu
— 100MB (@100MasterBlastr) June 11, 2023
గత నాలుగు-ఐదేళ్లలో ఇదే తన అత్యుత్తమ ప్రదర్శన అని అశ్విన్ అన్నాడు. 36 ఏళ్ల వయసులో ఇలాంటి ఆట చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రదర్శనతో అశ్విన్ మళ్లీ రిటైర్మెంట్ ఆలోచనను పక్కన పెట్టేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..