Asia Cup 2022: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే క్రికెట్ ప్రేమికుల కళ్లు నిలిచాయి. ఆసియాకప్ పాత రికార్డును పరిశీలిస్తే.. పాకిస్థాన్ జట్టుపై భారత్ పైచేయి భారీగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు 14 సార్లు తలపడ్డాయి. ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 8 సార్లు ఓడించింది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. 1997లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ఇవ్వలేదు.
గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గత ఏడాది తొలిసారిగా ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాక్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రస్తుతం టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
ఇరు జట్లకు భారీ ఎదురుదెబ్బలు..
టీ20 ఫార్మాట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ లాంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో బాబర్ ఆజం, ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ కూడా ఉన్నారు. బాబర్, రిజ్వాన్ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ జోడీల్లో ఒకటిగా నిలిచారు.
అయితే ఆసియా కప్‌లో ఇరు జట్లూ తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లేకుండానే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. వెన్నునొప్పి సమస్య కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో భాగం కాలేకపోయాడు. మరోవైపు, షాహీన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో ఇబ్బంది పడుతుండగా, అతను ఈసారి ఆసియా కప్‌లో జట్టులో భాగం కావడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.