Chandrayaan 3: చంద్రయాన్ 3 గ్రాండ్‌ సక్సెస్.. ఐర్లాండ్‌లో టీమిండియా క్రికెటర్ల సంబరాలు.. వీడియో చూశారా?

|

Aug 23, 2023 | 8:58 PM

ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని దేశం మొత్తం చూసి మురిసిపోయింది. ఇస్రో విజయాన్ని ఒక పండగలా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇంతటి గ'ఘన' విజయానికి కారణమైన శాస్త్రవేత్తలను అందరూ అభినందిస్తూ పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇక ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. బుధవారం టీమ్ ఇండియా మూడో టీ20 మ్యాచ్‌కు ముందు, ఐర్లాండ్‌లోని మలాహిడ్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌కు సమీపంలో ప్రత్యేకంగా..

Chandrayaan 3: చంద్రయాన్ 3 గ్రాండ్‌ సక్సెస్.. ఐర్లాండ్‌లో టీమిండియా క్రికెటర్ల సంబరాలు.. వీడియో చూశారా?
Chandrayaan 3, Team India
Follow us on

23 ఆగస్టు 2023.. భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరపురాని రోజు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కఠోర శ్రమ, ప్రణాళిక, ప్రయత్నాల ఆధారంగా భారత్ చంద్రుడిపై అడుగులు వేసింది. చంద్రుడిపైకి భారత్ పంపిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. చంద్రయాన్-3 బుధవారం చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. తద్వారా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా నిలిచింది. కాగా ఇస్రో సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని దేశం మొత్తం చూసి మురిసిపోయింది. ఇస్రో విజయాన్ని ఒక పండగలా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇంతటి గ’ఘన’ విజయానికి కారణమైన శాస్త్రవేత్తలను అందరూ అభినందిస్తూ పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇక ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. బుధవారం టీమ్ ఇండియా మూడో టీ20 మ్యాచ్‌కు ముందు, ఐర్లాండ్‌లోని మలాహిడ్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌కు సమీపంలో ప్రత్యేకంగా టీవీని ఏర్పాటు చేసి మరీ విక్రమ్‌ ల్యాండింగ్‌ను వీక్షించారు. ఇక చంద్రయాన్ తన ల్యాండర్ విక్రమ్‌తో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన వెంటనే, టీమిండియా ఆటగాళ్లు కూడా ఆనందంతో గెంతులు వేస్తూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ సంబరాలు జరుపుకొన్నారు. ఇక విరాట్ కోహ్లి నుండి సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, యోగేశ్వర్ దత్ వరకు భారత ప్రముఖ ఆటగాళ్లు కూడా ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

కాగా జూలై 14న ఇస్రో చంద్రయాన్‌ 3 ప్రాజెక్టును ప్రయోగించింది. అంతకుముందు 2008లో, భారతదేశం మొదటిసారిగా చంద్రుని కక్ష్యలోకి తన మిషన్‌ను పంపింది. ఆ తర్వాత 2019లో చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. అయితే ఈ మిషన్ పూర్తిగా విజయవంతం కాలేదు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదు. చంద్రునిపై సురక్షితంగా విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యింది. తద్వారా చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారతదేశం ఖ్యాతి గడించింది.

ఇవి కూడా చదవండి

టీమిండియా క్రికెటర్ల సంబరాలు..

సచిన్ టెండూల్కర్ ట్వీట్

వీరేంద్ర సెహ్వాగ్ విషెస్

యోగేశ్వర్ దత్ శుభాకాంక్షలు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..