T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ జట్టుపై కీలక ప్రకటన.. ఆ పరిస్థితి చూస్తే మార్పులు తప్పవంటోన్న హిట్‌మ్యాన్..

|

Aug 18, 2022 | 6:45 AM

ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ ఆగస్టు 28న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ ప్రపంచకప్ గురించి పెద్ద ప్రకటన చేశాడు.

T20 WC 2022: టీ20 ప్రపంచ కప్ జట్టుపై కీలక ప్రకటన.. ఆ పరిస్థితి చూస్తే మార్పులు తప్పవంటోన్న హిట్‌మ్యాన్..
Rohit Sharma (2)
Follow us on

Asia Cup 2022: ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆగస్టు 28 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో ఆసియా కప్‌నకు ముందు టీ20 వరల్డ్ టీమ్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ప్రకటన చేశాడు.

అక్కడి పరిస్థితి చూస్తుంటే మార్పు వచ్చే ఛాన్స్..

అయితే ఆసియా కప్‌కు ముందు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సంబంధించి.. ప్రపంచకప్‌‌నకు 80-90 శాతం జట్టు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చాడు. మేం ఇంకా ఆసియా కప్ 2022, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో T20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆస్ట్రేలియాలో పరిస్థితి దృష్ట్యా కొన్ని మార్పులు ఉండొచ్చు. రోహిత్ ఈ ప్రకటనతో మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్‌ల జట్టులో చేరాలనే ఆశ ఇప్పటికీ అలాగే ఉంది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌లో రోహిత్ చరిత్ర సృష్టించే ఛాన్స్..

ఆసియా కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచే అవకాశం ఉంది. ఆసియాకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 883 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మ 117 పరుగులు చేయగలిగితే, 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే 1000 పరుగులు చేశారు. అయితే ఇప్పటివరకు 1000 పరుగులు చేసిన ఆటగాళ్లిద్దరూ శ్రీలంకకు చెందినవారే. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార సంగక్కరలు ఆసియా కప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడు ఈ మైలురాయిని సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచే అవకాశం ఉంది.