ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌.. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్‌! ఎందుకంటే..?

ఎడ్జ్‌బాస్టన్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మంచి ప్రారంభం చేసినప్పటికీ, కోచ్ గౌతమ్ గాంభీర్ ప్లేయింగ్ ఎలెవెన్ ఎంపికపై అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా లేకపోవడం, సాయి సుదర్శన్‌ను తొలగించడం, అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌.. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్‌! ఎందుకంటే..?
Gautam Gambhir

Updated on: Jul 02, 2025 | 8:53 PM

ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు టీమిండియా మంచి స్టార్ట్‌ అందుకున్నప్పటికీ హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనను మంచిగా ప్రారంభించలేదు. లీడ్స్‌లో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీనికి ప్రధాన కారణం జట్టు ఫీల్డింగ్, బౌలింగ్ అనే విమర్శలు వచ్చారు. ముఖ్యంగా బౌలింగ్‌లో బుమ్రా తప్ప, మరే ఇతర పేసర్ సమర్థవంతంగా రాణించలేదు. అయితే రెండో టెస్టుకు బుమ్రా దూరంగా ఉన్నాడు. దాంతో పాటు రెండో టెస్ట్‌కు ఎంపిక చేసిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ చూసిన తర్వాత భారత క్రికెట్‌ అభిమానులు గంభీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి ఇంగ్లాండ్‌తో జరిగిన 2వ టెస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ 11పై క్రికెట్ నిపుణుల నుండి అభిమానుల వరకు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. 2వ టెస్ట్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11లో మూడు మార్పులు చేయడమే గంభీర్‌పై అభిమానుల కోపంగా ఉండటానికి కారణం. జస్‌ప్రీత్ బుమ్రాను జట్టు నుంచి తప్పించారు, యువ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్‌ను ఒక మ్యాచ్ తర్వాత జట్టు నుంచి తొలగించారు. అలాగే బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఎందుకు ఇవ్వలేదని అభిమానులు మండిపడుతున్నారు.

అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ష్‌దీప్ బాల్‌ను అద్భుతంగా స్వింగ్ చేయగలడు.. అలాంటి బౌలర్‌ను ఆడించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కుల్దీప్ యాదవ్‌కు కూడా అవకాశం ఇవ్వకపోవడం, సాయి సుదర్శన్‌ను తొలగించినందుకు గంభీర్‌ను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి