Team India: టీమిండియా ఆటగాళ్లు కూడా బాల్ ట్యాంపరింగ్ చేస్తారు: మాజీ ప్లేయర్ షాకింగ్ స్టేట్‌మెంట్
Praveen Kumar Comments on Ball Tampering: 2007లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్ 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. ఇందులో వరుసగా 77, 8, 27 వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ కుమార్ 2008, 2010లో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ప్రదర్శనల తర్వాత 2011 ODI ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, గాయం కారణంగా ప్రపంచకప్ ఆడలేకపోయాడు. అలాగే చివరిసారిగా 2012లో టీమ్ ఇండియా తరపున ఆడిన ప్రవీణ్ కుమార్ 2018లో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
Praveen Kumar Comments on Ball Tampering: బాల్ ట్యాంపరింగ్ గురించి టీమిండియా (Team India) మాజీ పేసర్ (Praveen Kumar) చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత్ సహా అన్ని జట్లకు చెందిన బౌలర్లు బంతి ఆకారాన్ని మార్చేందుకు తమ ప్రయత్నాలు చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతకుముందు, 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ చేశారు. ఈ మోసం వెలుగులోకి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వీరిద్దరిని 12 నెలల పాటు క్రికెట్ నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌లో బాల్ ట్యాంపరింగ్ సర్వసాధారణమైపోయిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. భారత బౌలర్లతో సహా అందరూ బంతిని వక్రీకరించి స్వింగ్ టెక్నిక్‌లతో ప్రయోగాలు చేస్తారంటూ చెప్పుకొచ్చాడు.
ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అన్ని జట్లూ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుంటాయి. పాక్ బౌలర్లు దీన్ని ఎక్కువగా చేసేవారు. బాల్ ట్యాంపరింగ్‌లో కూడా, ఆ నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. బంతిని స్క్రాచ్ చేసి ఎవరికైనా ఇస్తే.. రివర్స్ స్వింగ్ చేసే నైపుణ్యం వారికి ఉండాలి’’ అంటూ ప్రవీణ్ కుమార్ తెలిపాడు.
ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ గురించి ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటన చర్చకు దారితీయగా, మరోసారి బాల్ ట్యాంపరింగ్ అంశాలు తెరపైకి వచ్చాయి. కాబట్టి, ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించే అవకాశం ఉంది.
ప్రవీణ్ కుమార్ కెరీర్..
2007లో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్ 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. ఇందులో వరుసగా 77, 8, 27 వికెట్లు పడగొట్టాడు.
ప్రవీణ్ కుమార్ 2008, 2010లో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ప్రదర్శనల తర్వాత 2011 ODI ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, గాయం కారణంగా ప్రపంచకప్ ఆడలేకపోయాడు. అలాగే చివరిసారిగా 2012లో టీమ్ ఇండియా తరపున ఆడిన ప్రవీణ్ కుమార్ 2018లో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..