IND vs SA 2nd Test: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. రెండో టెస్టులో ఆడనున్న స్టార్ ప్లేయర్.. సౌతాఫ్రికా కష్టాలు మొదలిక..

Team India: ఈ ఆటగాడు గాయం కారణంగా చివరి క్షణంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. కానీ, ఇప్పుడు ఈ ఆటగాడు రెండవ మ్యాచ్‌లో తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆటగాడు టీమ్ ఇండియాతో ప్రాక్టీస్ కూడా చేశాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నట్లు కనిపించలేదు. రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

IND vs SA 2nd Test: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. రెండో టెస్టులో ఆడనున్న స్టార్ ప్లేయర్.. సౌతాఫ్రికా కష్టాలు మొదలిక..
Ind Vs Sa 2nd Test

Updated on: Dec 30, 2023 | 6:40 PM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ టెస్టులో టీమిండియా కేవలం మూడు రోజుల్లోనే ఓడిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఓ శుభవార్త అందనుంది. భారత్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ రెండో మ్యాచ్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఈ ఆటగాడే రవీంద్ర జడేజా.

గాయం కారణంగా జడేజా తొలి మ్యాచ్ ఆడలేదు. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ, ఇప్పుడు జడేజా ఫిట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. జనవరి 3 నుంచి కేప్ టౌన్‌లో ప్రారంభమయ్యే రెండవ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో అతను భాగమయ్యే అవకాశం బలంగా ఉంది.

శిక్షణ షురూ..

తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు జడేజాకు వెన్ను నొప్పి రావడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదు. వార్తా సంస్థ PTI ప్రకారం, జడేజా మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు జట్టు వార్మప్ సెషన్‌లో భాగమయ్యాడు. జడేజా ప్రాక్టీస్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది పడ్డట్టు కనిపించలేదు. అతను 30-40 మీటర్ల రేసును కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు కొన్ని ఫిట్‌నెస్ కసరత్తులు కూడా చేశాడు. రిజర్వ్ పేసర్ ముఖేష్ కుమార్‌తో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా ఇందులో విశేషం. దాదాపు 20 నిమిషాల పాటు జడేజా బౌలింగ్ చేశాడు. ఈ సమయంలో కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ అతనిపై ఒక కన్నేసి ఉంచాడు. ఈ సమయంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు పడినట్లు కనిపించలేదు.

రెండవ టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో..

రెండో టెస్టు మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో జడేజా తన పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందగలడు. అతని రాక జట్టు బౌలింగ్‌కు బలం చేకూర్చడమే కాకుండా జట్టు బ్యాటింగ్‌కు మరింత లోతుగా మారనుంది. జడేజా బ్యాటింగ్ కూడా చేయగలడు. అతను తన బ్యాట్‌తో జట్టును గెలిపించడానికి, మ్యాచ్‌ను కాపాడడంలో తన సహాయం అందించగలడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇలా చాలాసార్లు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..