IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!

Zimbabwe vs India, 3rd T20I: భారత్, జింబాబ్వే మధ్య ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.

IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
Ind Vs Zim

Updated on: Jul 26, 2026 | 4:10 PM

Zimbabwe vs India, 3rd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత జట్టులో 2 కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. ప్రిన్స్ యాదవ్, శివం దుబే మ్యాచ్ నుంచి తప్పుకోగా, అశోక్ శర్మ, సూర్యాంశ్ షెడ్గేలకు ఛాన్స్ దక్కింది.  ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

భారత్, జింబాబ్వే మధ్య ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

ఇరు జట్లు:

జింబాబ్వే ప్లేయింగ్ XI: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ.

భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, రింకు సింగ్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్.

Follow Us