
Team India :ఐపీఎల్ 2026 సందడి దేశవ్యాప్తంగా మొదలవుతున్న వేళ, బీసీసీఐ ఒక కీలక ప్రకటన చేసింది. పురుషుల ఐపీఎల్ ఫీవర్ ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు సిద్ధమైంది. ఏప్రిల్ 2026లో జరగనున్న ఈ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు. ఈ పర్యటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. భారత టీ20 జట్టులోకి ఇద్దరు యువ క్రీడాకారిణులు తొలిసారిగా ఎంపికయ్యారు. వారు కశ్వి గౌతమ్, అనుష్క శర్మ. వీరిద్దరూ డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరచడం వల్ల సెలెక్టర్లు వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. ఈ కొత్త రక్తంతో జట్టు మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. వీరితో పాటు సీనియర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ తమ మెరుపులతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు.
సౌతాఫ్రికా పర్యటనకు భారత జట్టు (15 మంది సభ్యులు):
బీసీసీఐ ఎంపిక చేసిన ఈ 15 మంది సభ్యుల జట్టులో అనుభవం, యువత కలయిక కనిపిస్తోంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుక ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కశ్వి గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.
🚨 𝗦𝗾𝘂𝗮𝗱 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 🚨
Here’s a look at #TeamIndia‘s squad for the 5️⃣-match T20I series against South Africa 🙌
Details ▶️ https://t.co/GpzX5MiEDp#SAvIND pic.twitter.com/5tEP7x4HnZ
— BCCI Women (@BCCIWomen) March 24, 2026
సౌతాఫ్రికా పర్యటన పూర్తి షెడ్యూల్
మొత్తం 5 టీ20ల సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానుంది. వివిధ నగరాల్లో జరిగే ఈ మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి టీ20: ఏప్రిల్ 17 – డర్బన్
రెండో టీ20: ఏప్రిల్ 19 – డర్బన్
మూడో టీ20: ఏప్రిల్ 22 – జోహన్నెస్‌బర్గ్
నాలుగో టీ20: ఏప్రిల్ 25 – జోహన్నెస్‌బర్గ్
ఐదో టీ20: ఏప్రిల్ 27 – బెనోని
సన్నద్ధం అవుతున్న టీమిండియా
భారత మహిళల జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా డర్బన్, జోహన్నెస్‌బర్గ్ వంటి వేగవంతమైన పిచ్‌లపై మన బౌలర్లు రేణుక ఠాకూర్, శ్రేయాంక పాటిల్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ సీజన్ మధ్యలో ఈ సిరీస్ రావడం వల్ల క్రికెట్ ప్రేమికులకు పగలు ఐపీఎల్, సాయంత్రం భారత్ అంతర్జాతీయ మ్యాచ్‌లతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది.