ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచకప్ గెల్చుకుని చరిత్ర సృష్టించేందుకు మరో రెండడుగుల దూరంలో ఉన్నారు. శుక్రవారం జరిగే మొదటి సెమీఫైనల్‌లో టీమిండియా పటిష్ఠమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. కాగా అటు క్రికెట్, ఇటు హాకీ.. ఏ మేజర్ టోర్నమెంట్ అయినా టీమిండియాకు షాకుల మీద షాకులు ఇస్తుంది కివీస్ జట్టు. మరి ఈ మ్యాచ్‌తోనైనా టీమిండియా తలరాత మారేనా? కివీస్‌పై విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించేనా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా టీమిండియాలో సీనియర్ క్రికెటర్లయిన షెఫాలీ వర్మ, రిచా ఘోష్ అండర్19 ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే రిచా చాలా మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేయలేదు. అయితే షెఫాలీతో కో-కెప్టెన్ శ్వేతా షెరావత్ జోడీ ఓపెనింగ్‌లో భారీగా పరుగులు సాధిస్తోంది. దీనికి తోడు ప్రపంచకప్ టోర్నీల్లో షెఫాలీకి ఘనమైన రికార్డులు ఉన్నాయి. టోర్నీలో మొత్తం 9 మ్యాచ్‌ల్లో షెఫాలీ 251 పరుగులు చేసింది. స్ట్రైక్‌రేట్ 140కి పైగా ఉంది. ఇక శ్వేత 10 మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేసింది. స్ట్రైక్‌రేట్ 130 కంటే తక్కువ కానీ సగటు 45 కంటే ఎక్కువ. న్యూజిలాండ్‌పై విజయం సాధించాలంటే ఈ జోడీ క్రీజులో నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యం.
ఇక భారత స్పిన్నర్లు కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్ మన్నత్ కశ్యప్, లెగ్ స్పిన్నర్ పార్శ్వి చోప్రా స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. ఈ టోర్నీలో వీరిద్దరూ 8 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశారు. సూపర్ సిక్స్‌లో శ్రీలంకపై పార్శ్వి కేవలం 5 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. సెమీ-ఫైనల్‌కు ముందు, భారత కెప్టెన్ షెఫాలీ వర్మ మాట్లాడుతూ, ‘మేము సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాము. మేము చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాము. కాగా మిథాలీ U19 మహిళల ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.
షెఫాలీ వర్మ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సౌమ్య తివారీ, గొంగడి త్రిష, రిచా ఘోష్(వికెట్ కీపర్), హృషితా బసు, టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, సోనమ్ యాదవ్
అన్నా బ్రౌనింగ్, ఎమ్మా మెక్‌లియోడ్, జార్జియా ప్లిమ్మర్, ఇసాబెల్లా గాజ్(w), ఇజ్జీ షార్ప్(సి), ఎమ్మా ఇర్విన్, కేట్ ఇర్విన్, పైజ్ లాగ్గెన్‌బర్గ్, నటాషా కోడైర్, కైలీ నైట్, అబిగైల్ హాట్టన్
#TeamIndia have won the toss and elect to bowl first against New Zealand in the semi-final at #U19T20WorldCup
A look at our Playing XI for the game.
Live – https://t.co/pJD0VbOROm #INDvNZ #U19T20WorldCup pic.twitter.com/V9NDqNGoO1
— BCCI Women (@BCCIWomen) January 27, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..