AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prize Money : చరిత్ర సృష్టించినా చిన్నచూపే..అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ విన్నర్లకు దక్కిన ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవుతారు

శ్రీలంక రాజధాని కొలంబోలోని చారిత్రక పి.సారా ఓవల్ మైదానంలో ఆదివారం (నవంబర్ 23) భారత అంధ మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ 2025 ఫైనల్‌లో భారత్, నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Prize Money : చరిత్ర సృష్టించినా చిన్నచూపే..అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ విన్నర్లకు దక్కిన ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవుతారు
Blind Women's T20 World Cup
Rakesh
|

Updated on: Nov 24, 2025 | 10:59 AM

Share

Prize Money : శ్రీలంక రాజధాని కొలంబోలోని చారిత్రక పి.సారా ఓవల్ మైదానంలో ఆదివారం (నవంబర్ 23) భారత అంధ మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ 2025 ఫైనల్‌లో భారత్, నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, దివ్యాంగ మహిళా క్రీడాకారుల ధైర్యం, ప్రతిభ, కలలకు దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా నిలవడం గొప్ప విషయం.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రపంచ కప్ గెలిస్తే కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఈ నెల ప్రారంభంలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచినప్పుడు కూడా ఆటగాళ్లపై కోట్లాది రూపాయల నగదు బహుమతులు కురిశాయి. కానీ చారిత్రక విజయాన్ని అందుకున్న భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు మాత్రం చాలా చిన్న ప్రైజ్ మనీ దక్కింది. ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియాలోని ప్రతి క్రీడాకారిణికి లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి లభించనుంది. ఈ ప్రైజ్ మనీని చింటల్స్ గ్రూప్ అనే సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతానికి క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) నుంచి ఎలాంటి అధికారిక ప్రైజ్ మనీ ప్రకటన రాలేదు. అయితే ఈ ఛాంపియన్ జట్టు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, CABI కూడా నగదు బహుమతిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, ఈ క్రీడాకారులకు వారి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆర్థిక సహాయం లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఇంత గొప్ప గౌరవం తెచ్చిన అంధ క్రీడాకారిణులకు మరింత మెరుగైన ప్రైజ్ మనీ, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ దీపిక టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమని తేలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో, నేపాల్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే టార్గెట్‌ను సులభంగా ఛేదించింది. భారత్ తరపున ఫూలా సరెన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 27 బంతుల్లో నాటౌట్ 44 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపింది. మరో బ్యాట్స్‌మెన్ కరుణ కే కూడా 27 బంతుల్లో 42 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..