IND vs WI: టీమ్‌ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్‌ పనిచేసేనా..?

|

Feb 05, 2022 | 6:24 PM

IND vs WI: భారత్‌లో మణికట్టు స్పిన్నర్ల సంఖ్య చాలా తక్కువ. మొదటి వన్డేకి ఎంపికైన ఆటగాళ్లలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ జోడీకి చోటు దక్కింది.

IND vs WI: టీమ్‌ ఇండియాలోకి మళ్లీ కుల్చా జోడి.. మ్యాజిక్‌ పనిచేసేనా..?
Yuzvendra Kuldeep
Follow us on

IND vs WI: భారత్‌లో మణికట్టు స్పిన్నర్ల సంఖ్య చాలా తక్కువ. మొదటి వన్డేకి ఎంపికైన ఆటగాళ్లలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ జోడీకి చోటు దక్కింది. ఇద్దరూ ఒకప్పుడు టీమ్ ఇండియాలో సాధారణ సభ్యులు. వీరిద్దరు కుల్చా అనే పేరుతో చాలా ఫేమస్‌. చాలా కాలం తర్వాత ఈ జోడీ మరోసారి టీమిండియాలో కనిపించబోతోంది. తొలి వన్డేలో ఈ జోడీ మరోసారి సత్తా చాటుతుందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆశిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా కలిసి కనిపించడం లేదు. 2021 జూలైలో శ్రీలంకతో కుల్దీప్ టీమ్ ఇండియా తరఫున చివరి వన్డే ఆడాడు. ఇప్పటి వరకు ఆడిన 65 వన్డేల్లో కుల్దీప్ 107 వికెట్లు తీశాడు. అతను 7 టెస్టులు, 23 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. చాహల్‌ ప్రత్యర్థులను మరింత ఇబ్బందికి గురిచేస్తాడు. రోహిత్ వారిపై నమ్మకం ఉంచేందుకు సిద్ధమయ్యాడు.

కుల్దీప్, చాహల్ జోడీ మళ్లీ కనిపించనుంది

స్పిన్‌ విభాగంలో ‘కుల్‌చా’ అంటే కుల్‌దీప్‌, చాహల్‌ల జోడీ. ప్రారంభంలో ఈ జోడీ బాగా రాణించిందని రోహిత్‌ చెప్పాడు. మధ్యలో వేరే కాంబినేషన్ల కోసం వెతకడం వల్ల ఈ జంట విడిపోయిందన్నాడు. అయితే ఇప్పుడు వాళ్లను కలిసి ఆడిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు.

కుల్దీప్‌పై ఒత్తిడి పెంచడం రోహిత్ శర్మకు ఇష్టం లేదు

‘కుల్‌దీప్‌ని నిదానంగా తీసుకురావాలనుకుంటున్నామని తొందరపాటు వద్దు అని రోహిత్ అన్నాడు. అతనికి కొంత సమయం ఇవ్వడం ముఖ్యం. ఇద్దరు బౌలర్లు కీలకం. చాహల్ దక్షిణాఫ్రికాలో ఆడాడు. కుల్దీప్ ఇటీవలే జట్టులోకి తిరిగి వచ్చాడు. కుల్దీప్ తన ఊపును తిరిగి పొందడానికి చాలా మ్యాచ్‌లు ఆడాలి’ అన్నాడు.

చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ఈ విషయాల ప్రస్తావన రాకూడదు.. వచ్చిందంటే బంధం బలహీనం..?

Viral Photos: రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట చాలా ఫేమస్‌.. దీనిని ఒక వ్యాపారవేత్త నిర్మించారు..?

Chili Powder: కారంపొడితో చాలా ప్రమాదం.. అతిగా వాడితే ఈ రోగాలు..?