AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?

KL Rahul: ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ (India vs West India ODI) ప్రారంభం కానుంది.

IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?
kl rahul
Venkata Chari
|

Updated on: Feb 03, 2022 | 1:31 PM

Share

Indian Cricket Team: జనవరి 6న భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(KL Rahul) ఆడడం లేదు. అహ్మదాబాద్ మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. తన సోదరి పెళ్లి కారణంగా భారత్-వెస్టిండీస్(India vs West Indies ODI) సిరీస్‌లోని తొలి వన్డేలో కేఎల్ రాహుల్ ఆడడని వార్తలు వస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పరంగా కేఎల్ రాహుల్ మొదటి వన్డేకు దూరంగా ఉన్నారని గతంలో భావించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు టీమిండియాను ప్రకటించినప్పుడు, రెండవ వన్డే నుంచి కేఎల్ రాహుల్ టీమిండియాతో ఉంటాడని బీసీసీఐ కూడా వెల్లడించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

కలసిరాని కెప్టెన్సీ.. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ భారత కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీతో అతడు ఈ బాధ్యతలు చేపట్టాడు. అయితే, కెప్టెన్‌గా అతని ఆరంభం బాగాలేకపోవడంతో వన్డే సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో ఓడిపోయింది. అంతకుముందు టెస్టు సిరీస్ సందర్భంగా ఓ మ్యాచ్‌లో కెప్టెన్సీని కూడా చేపట్టాడు. ఇందులోనూ భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

రాహుల్‌కి బదులు మిడిలార్డర్‌లో ఎవరు వస్తారు? తొలి వన్డేలో కేఎల్ రాహుల్ ఆడకపోతే మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్ లేదా దీపక్ హుడాను తీసుకోవచ్చని తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడే అవకాశం ఉంది. కానీ, అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో తొలి వన్డేలో ఆడే అవకాశం లేదు. వన్డే సిరీస్ సమయంలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ కాకుండా మిడిల్ ఆర్డర్‌లో భాగంగా ఉన్నాడు. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ ఆడాల్సి ఉంది. అయితే ధావన్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలాడు. శ్రేయాస్, ధావన్‌తో పాటు యువ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్, స్టాండ్ బై ప్లేయర్ నవదీప్ సైనీ కూడా పాజిటివ్‌గా తేలారు. దీంతో తొలి వన్డేలో రోహిత్ కొత్త భాగస్వామితో ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది.

మయాంక్ ఓపెనింగ్ చేస్తాడా? మయాంక్ అగర్వాల్ వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టగలడని విశ్వసిస్తోంది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ తర్వాత కోల్‌కతా వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: Women IPL: మహిళల ఐపీఎల్‌‌పై గంగూలీ కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎలా నిర్వహించనున్నారంటే?

IND vs WI: గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. అహ్మదాబాద్‌లో రికార్డుల మోత.. తాజాగా టీమిండియా కూడా..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే