IPL 2022: అతను వికెట్ తీస్తే రూ. 1.66 కోట్లు.. గతేడాది టాప్ ప్లేస్‌లో నిలిచిన ఆర్‌సీబీ బౌలర్.. ఈ ఏడాది మాత్రం..

Kyle Jamieson: భవిష్యత్తు కోసమే ఐపీఎల్ 2022కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆటపై ఇంకాస్త కఠినంగా పనిచేయాలని..

IPL 2022: అతను వికెట్ తీస్తే రూ. 1.66 కోట్లు.. గతేడాది టాప్ ప్లేస్‌లో నిలిచిన ఆర్‌సీబీ బౌలర్.. ఈ ఏడాది మాత్రం..
Kyle Jamieson
Follow us

|

Updated on: Feb 03, 2022 | 3:00 PM

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు(New Zealand Cricket Team) ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్(Kyle Jamieson) ఈ సంవత్సరం క్వారంటైన్, బయో బబుల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఇంట్లో సమయాన్ని గడపడంతోపాటు తన ఆటను మెరుగుపరచుకోవడానికి ఐపీఎల్ 2022(IPL 2022)తోపాటు, న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ అయిన ప్లాంకెట్ షీల్డ్‌లో తన జట్టు ఆక్లాండ్‌కు దూరంగా ఉంటానని సమాచారం అందించాడు. గతేడాది ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన రెండో ఆటగాడిగా జేమీసన్ నిలిచాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. IPL 2021 వేలంలో అతను రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ సీజన్ అతనికి ప్రత్యేకంగా ఏమీ లేదు. RCB తరపున తొమ్మిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అంటే ఆర్సీబీ తరపున అతను ఒక వికెట్‌ను పడగొట్టినందుకు రూ.1.66 కోట్లు అందుకున్నాడు.

జేమీసన్ ఈఎస్‌పీఎన్‌తో మాట్లాడుతూ, ‘నేను చాలా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను. గత పన్నెండు నెలలుగా బయో బబుల్, క్వారంటైన్‌లో ఎక్కువ సమయం గడిపాను. రాబోయే 12 నెలల షెడ్యూల్‌ను పరిశీలిస్తే, ఇప్పుడు నేను కుటుంబంతో గడపాలనుకుంటున్నాను. రెండవది, నేను అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా కొత్త. రెండేళ్లు మాత్రమే అయింది. కాబట్టి నా ఆటపై కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. నేను ఉండాల్సిన స్థాయికి చేరుకోలేకపోయాను. మూడు ఫార్మాట్లలో ఆడాలంటే, ఆటపై చాలా కష్టపడాలి’ అంటూ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం కఠిన నిర్ణయమే.. ఫిబ్రవరి 2020లో భారత్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జేమీసన్ 12 టెస్టులు, ఐదు వన్డేలు, 8 టీ20లు ఆడాడు. ఐపీఎల్ ఆడకూడదనే నిర్ణయం చాలా కష్టమైన విషయమని, అయితే భవిష్యత్తులో లీగ్‌లో తాను భాగమవుతానని ఆశిస్తున్నట్లు జేమీసన్ తెలిపాడు. ‘ప్రారంభంలో ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను దీని గురించి చాలా ఆలోచించాను. కానీ నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలని, నా ఆటపై పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపాడు. కైల్ జేమీసన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఆడనున్నాడు.

Also Read: Sourav Ganguly: ప్రమాదంలో ఆ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు.. పరోక్షంగా చెప్పిన బీసీసీసీ అధ్యక్షుడు గంగూలీ..

IND vs WI: టీమిండియాకు మరోదెబ్బ.. తొలి వన్డేకు దూరమైన కీలక ప్లేయర్.. కారణం ఏంటంటే?

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో