India vs West Indies: మూడంకెల ముచ్చట తీరేనా? కోహ్లీ సెంచరీతో ఆ దిగ్గజాల స్పెషల్ రికార్డులకు బ్రేకులు..!

|

Feb 05, 2022 | 12:01 PM

Virat Kohli: అహ్మదాబాద్‌లో ఆదివారం ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడినప్పుడు విరాట్ కోహ్లీ భారీ వన్డే రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతాడు.

India vs West Indies: మూడంకెల ముచ్చట తీరేనా? కోహ్లీ సెంచరీతో ఆ దిగ్గజాల స్పెషల్ రికార్డులకు బ్రేకులు..!
virat
Follow us on

India Vs West Indies 2022: విరాట్ కోహ్లీ(Virat Kohli) ఏ ఫార్మాట్‌లోనూ రెండేళ్లుగా సెంచరీ చేయలేదు. దీంతో మాజీ భారత కెప్టెన్ ఫామ్‌లో లేనట్లు భావిస్తున్నారు. మూడు అంకెల మార్కు కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. విరాట్ కోహ్లి తన చివరి సెంచరీ 2019లో సాధించాడు. 2020, 2021లో సెంచరీ చేయనప్పటికీ, కోహ్లీ సగటు 35 (అన్ని ఫార్మాట్లలో కలిపి) సాధించాడు. భారత (Team India)మాజీ కెప్టెన్‌కు 2022 సంవత్సరం బాగానే ప్రారంభమైంది. 4 మ్యాచ్‌లలో (అన్ని ఫార్మాట్‌లలో) కోహ్లీ 44.80 సగటుతో 224 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడిలో మూడంకెల స్కోర్‌ను సాధించడంలో విఫలమయ్యాడని మాజీలు భావించారు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ సారథిగా లేకపోవడంతో, వెస్టిండీస్ సిరీస్‌(India vs West Indies)లో తన స్పెషల్ సెంచరీని సాధిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సెంచరీ సాధించేందుకు కోహ్లీకి మరో కారణం కూడా ఉంది. కోహ్లి ఇప్పటికే కరీబియన్‌ జట్టుపై తొమ్మిది వన్డే సెంచరీలు సాధించాడు. ఇది ఒక ప్రత్యర్థిపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడి కోహ్లీ నిలిచాడు.

కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాపై 9 వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌తో రికార్డును పంచుకున్నాడు. అయితే ఈ సిరీస్‌లో విండీస్ జట్టుపై మూడంకెల మార్కును చేరుకోగలిగితే అగ్రస్థానంలోకి చేరుకుంటాడు.

వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. తొలి గేమ్ ఆదివారం జరగనుండగా, రెండోది ఫిబ్రవరి 9న, మూడో వన్డే ఫిబ్రవరి 11న జరగనుంది. వన్డే సిరీస్ తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగనుంది.

Also Read: U19 World Cup, IND vs ENG, Head to Head Records: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ పోరులో రికార్డులు ఎలా ఉన్నాయంటే?

AUS vs PAK: కొత్త కోచ్‌తో పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా టీం.. జస్టిస్ లాంగర్ వారసుడు ఎవరంటే?