IND vs SL: టీమిండియా రెండో సిరీస్‌పై కన్నేసింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న శిఖర్ సేన.. టీ20లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తొలి టీ20లో విజయం సాధించి.. రెండో టీ20లో ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. నేడు ప్రేమదాస్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో రెండవ టీ20లో తలపడనుంది. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు రెండవ టీ20లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. లేదంటే టీంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రెండవ టీ20లో విజయం సాధిస్తే.. పృథ్వీ, సూర్యలకు మూడవ టీ20లో విశ్రాంతినిస్తారు. కాగా, ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లు బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
పిచ్, వాతావరణం: వర్షం పడే అవకాశం లేదు. ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది.
మీకు తెలుసా:
– శ్రీలంక ఆడిన చివరి ఐదు టీ20 సిరీస్‌లలో ఓడిపోయింది.
– 2019 వన్డే ప్రపంచ కప్ నుంచి 28 టీ 20 లో టీమిండియా ఎకానమీ రేటు 8.62 గా ఉంది.
– 2017/18 సీజన్ నుంచి సూర్యకుమార్ యాదవ్ 87 టీ 20 ల్లో 38.50 సగటుతో 2772 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 94 నాటౌట్.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్: పృథ్వీ షా, శిఖర్ ధావన్ (కెప్టెన్), సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి
శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, అషేన్ బండారా / భానుకా రాజపక్సే, దసున్ షనక (కెప్టెన్), వనిండు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉదనా, దుష్మంత చనాజరా
Also Read: ఒలింపిక్స్‌లో ఫిలిప్పీన్స్‌కి తొలి పసిడి పతకం.. దేశంలో మార్మోగిపోతున్న ఆమె పేరు