పాకిస్తాన్-శ్రీలంక సంయుక్త వేదికపై జరుగుతున్న ఆసియా కప్-2023 టోర్నమెంట్ చివరి రోజుకు చేరుకుంది. సూపర్ 4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత్, శ్రీలంక జట్లు ఈ రోజు కొలంబోటోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ ఇరు జట్లు ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 9వ సారి టైటిల్ మ్యాచ్‌లో తలపడనుండడం విశేషం. ఇప్పటి వరకు లంకపై భారత్ 5 సార్లు(1984,1988, 1991, 1995, 2010).. భారత్‌పై శ్రీలంక 3 సార్లు(1997, 2004, 2008) నెగ్గాయి. ఈ క్రమంలో భారత్‌పై నేటి ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి, టైటిల్ లెక్కలను సమం చేయాలని దసున్ షనక నేతృత్వంలోని లంక భావిస్తోంది. అయితే 5 సంవత్సరాలుగా ఆసియా కప్ టైటిల్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా మాత్రం ఈ సారి ఎలా అయినా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉంది.
The Battle for the Asian Crown! 🏆👑
Join us on September 17th at RPICS, Colombo for an epic showdown! ఇవి కూడా చదవండిSecure your tickets today – https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 #SLvIND pic.twitter.com/jsYVGgVkLM
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
ఇదిలా ఉండగా నేటి ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయాలతోనే సాహసోపేతమైన ఆట కనబర్చిన అక్షర్ పటేల్ ఫైనల్‌కు దూరం కానున్నాడు. ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న అక్షర్ దూరం కావడంతో జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అయితే సుందర్ ఫైనల్ ఆడతాడా లేదా అన్నది తుది జట్టును ప్రకటించే వరకూ సందేహమే. అలాగే బంగ్లాపై ఆడిన మ్యాచ్‌కు దూరమైన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ జట్టులోకి తిరిగి రానున్నాడు. మరోవైపు లంక జట్టుకు కీలక ఆటగాడు, మిస్టరీ స్పిన్నర్ మహిష్ తీక్షణ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో సహన్ అరాచిగే జట్టులోకి వచ్చాడు.
🇮🇳🆚🇱🇰 Asia Cup final record ⚔️
India – 4
Sri Lanka – 3Who will win the 2023 final? 🤔#INDvSL #INDvsSL #AsiaCup2023 pic.twitter.com/deRSyUJVmV
— Cricket.com (@weRcricket) September 15, 2023
కాగా, 2010 తర్వాత భారత్, శ్రీలంక జట్లు తొలిసారిగా తలపడబోతున్నాయి. ఇరు దేశాల మధ్య చివరిసారి జరిగిన ఆసియా కప్ 2010ఫైనల్ మ్యాచ్‌లో లంకను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 81 రన్స్ తేడాతో ఓడించింది. ఆ తర్వాత 2016, 2018 టోర్నీల్లో భారత్ గెలిచినా.. అది శ్రీలంకపై కాదు. ఇలా 13 సంవత్సరాల తర్వాత ఇరు జట్ల మధ్య జరగబోతున్న ఆసియా కప్ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండడంతో.. ఆసియా కప్ గెలుచుకొని తమ సత్తా ఏమిటో మెగా టోర్నీలోని ఇతర జట్లకు చాటి చెప్పాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.
అయితే భారత్, శ్రీలంక మధ్య జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. దీంతో మ్యాచ్‌కి సెప్టెంబర్ 18ని ఏసీసీ రిజర్వ్ డేగా ప్రకటించింది. నిజానికి రేపు కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల్లోనూ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది, ఇలా జరిగినా ఫలితం తేలకుంటే ఇరు జట్లను ఆసియా కప్ 2023 టైటిల్ విన్నర్లుగా ప్రకటిస్తారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహీష పతిరణ, కసున్ రజిత, సహన్ అరాచిగే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..