India vs Sri Lanka 2nd Test: రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులో చేరిన డే అండ్ నైట్ మ్యాచ్ స్పెషలిస్ట్ ప్లేయర్..

|

Mar 08, 2022 | 9:55 AM

జట్టుకు ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లు అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది. రవీంద్ర జడేజా కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అదే సమయంలో, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్‌లు..

India vs Sri Lanka 2nd Test: రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులో చేరిన డే అండ్ నైట్ మ్యాచ్ స్పెషలిస్ట్ ప్లేయర్..
India Vs Sri Lanka 2nd Test Axar Patel
Follow us on

భారత్-శ్రీలంక(India vs Sri Lanka) మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టు నుంచి తప్పుకున్నాడు. రెండో టెస్టు మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్ డే-నైట్ టెస్టుగా జరగనుంది. అక్షర్ పూర్తిగా ఫిట్‌గా లేడు. దాని కారణంగా అతను మొదటి టెస్ట్ ఆడలేకపోయాడు. Cricbuzz వార్తల ప్రకారం, అక్షర్ మొహాలీ టెస్ట్ సందర్భంగా మార్చి 6 ఆదివారం భారత జట్టులో చేరాడు. మొహాలీలో అక్షర్‌కి బ్యాకప్ ఎంపికగా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి చేర్చారు.

జట్టుకు ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లు అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడింది. రవీంద్ర జడేజా కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అదే సమయంలో, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్‌లు కూడా జట్టులో ఉన్నారు.

జట్టు ఎంపిక సమయంలో పటేల్ ఫిట్‌గా లేడు..

ఫిబ్రవరి 22న BCCI శ్రీలంకతో జరిగే 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది. అప్పటికి అక్షర్ ఇంకా పునరావాసంలో ఉన్నాడని, మొదటి టెస్టులో ఎంపికకు అందుబాటులో ఉండడని బోర్డు తెలిపింది. దీంతో రెండవ టెస్టులో ఎంపిక కోసం అందుబాటులో ఉన్నాడు.

డిసెంబర్ నుంచి జట్టుకు దూరమైన అక్షర్..

డిసెంబర్ నుంచి జట్టుకు దూరమైన అక్షర్ పటేల్.. గతేడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. దీని తర్వాత ఒత్తిడి కారణంగా అతను మైదానానికి దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో కూడా అతనికి జట్టులో చోటు దక్కలేదు. అక్షర్ ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. బెంగళూరు టెస్ట్‌లో జయంత్ యాదవ్ స్థానంలో XI ఆడటం కూడా చూడొచ్చు.

డే-నైట్ టెస్ట్‌లో అద్బుతమైన రికార్డు..

అక్షర్ పటేల్ ఇప్పటివరకు ఒక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడి అందులో 11 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అతను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తన సొంత మైదానంలో ఇంగ్లాండ్‌తో పింక్ బాల్ టెస్ట్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6/38, రెండవ ఇన్నింగ్స్‌లో 5/32 అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు.

Also Read: IPL 2022: ధోని టీంలో చేరిన కొత్త ప్లేయర్.. సూరత్‌లో మొదలైన సీఎస్‌కే సందడి..

Sunil Gavaskar-Shane Warne: షేన్ వార్న్‌ గురించి అలా అనాల్సింది కాదు.. అసలు అలా ప్రశ్నించడమే తప్పు: సునీల్ గవాస్కర్