IND vs SL 2nd ODI Highlights: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలిచి సిరీస్ నెగ్గింది. దీంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను దక్కించుకుంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో భారత్ విజయ కేతనం ఎగరేసింది. అంతకు ముందు 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకానొక సమయంలో ఓటమి దిశగా ప్రయాణించింది. అయితే క్రీజులోకి వచ్చిన దీపక్ చాహర్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 69 పరుగులతో అద్భుతంగా రాణించడంతో భారత్ విజయాన్ని దక్కించుకుంది.
ఇక అంతకు ముందు 50 ఓవర్లలో లంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 పరుగులు, అవిష్క ఫెర్నాండో 50 పరుగులు అర్ధ శతాకాలతో రాణించారు. చివరలో కరుణరత్నె చెలరేగిపోయాడు. 44 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 11పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్ తలో మూడు వికెట్లు, చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు. 276 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా క్రీజులోకి అడుగుపెట్టారు.
భారత్: ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్.
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, రజిత
2nd ODI. Sri Lanka win the toss and elect to bat https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారీ పోతుందని అందరూ భావించిన సమయంలో క్రీజులోకి వచ్చిన దీపక్ చాహర్ రాణించడంతో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతుందనుకుంటున్న సమయంలో చాహర్ జట్టును ఒంటి చేత్తో నడిపిస్తూ విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక చాహర్‌కు మంచి భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు భువనేశ్వర్. ఈ క్రమంలోనే భారత్ విజయానికి కేవలం 16 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో దీపక్ చాహర్ (58), భువనేశ్వర్ (13) పరుగులతో కొనసాగుతున్నారు. భారత్ విజయం సాధించాలంటే 18 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది.
టీమిండియా ఓటమి దిశగా వెళుతోన్న సందర్భంలో జట్టును ఆదుకునే పనిలో పడ్డాడు దీపక్ చాహర్. ఈ క్రమంలోనే జట్టు స్కోరును పరుగుల పెట్టించిన చాహర్ తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కీలక సమయంలో రాణించిన చాహర్ 64 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 35 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది.
వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను దీపక్ చాహర్, భువనేశ్వర్‌లు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతున్నారు. భారత్ 39 ఓవర్‌లు ముగిసే సమయానికి 200 మార్కును దాటేసింది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 42 ఓవర్‌లకు గాను 7 వికెట్ల నష్టానికి 220 పరుగుల వద్ద కొనసాగుతోంది. టీమిండియా గెలవాలంటే 48 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది.
భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్య 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. హసరంగా 35 ఓవర్‌లో వేసిన తొలి బంతికే కృనాల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో దీపక్ చాహర్ (12), భువనేశ్వర్ కుమార్ (1) కొనసాగుతున్నారు. భారత్ విజయాన్ని అందుకోవాలంటే 72 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి ఉంది.
29వ ఓవర్‌లో భారత్‌కు అదనంగా ఐదు పరుగులు లభించాయి. బౌలర్ సందకన్ వేసిన ఈ ఓవర్‌లో ఏకంగా ఐదు వైడ్లు పడ్డాయి. ప్రస్తుతం భారత్ 32 ఓవర్లుకుగాను భారత్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. ప్రస్తుతం టీమిండియా గెలుపొందాలంటే 92 పరుగులు చేయాల్సి ఉంది.
భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 53 ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 53 ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 26 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ 26 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 120 పరుగుల దూరంలో ఉంది. 43 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 6 ఫోర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు.
5⃣0⃣ in his second T20I ?
5⃣0⃣ (and going strong) in his second ODI ?Well done, @surya_14kumar! ? ? #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/HHeGcqGQXM pic.twitter.com/THMu6jI83p
— BCCI (@BCCI) July 20, 2021
భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయం సాధించాలంటే ఇంకా 30 ఓవర్లలో 150 పరుగులు చేయాలి.
భారత్ 116 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య డకౌట్ అయ్యాడు. షనక వేసిన 18 ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ ఆడిన బంతి బౌలర్ చేతికి తగిలి నాన్ స్టైక్ ఎండ్ లోని వికెట్లను తాకింది. మనీశ్ పాండే క్రీజు బయట ఉండటంతో ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య చివరిబంతికి డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత్ 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మనీశ్ పాండే 37 రనౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి హార్దిక్ పాండ్య వచ్చాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడుతున్నాడు. విజయానికి ఇంకా 160 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. భారత్ ఒత్తిడిలో ఆడుతుంది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వరుసగా వికెట్లు తీస్తున్నారు.
16 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. మనీశ్ పాండే 33 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు ఆట కొనసాగిస్తున్నారు. విజయానికి ఇంకా169 పరుగులు కావల్సి ఉంది.
15 ఓవర్లకు భారత్ మూడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు, మనీశ్ పాండే 32 పరుగులు ఆట కొనసాగిస్తున్నారు. విజయానికి ఇంకా 178 పరుగులు కావల్సి ఉంది.
భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 29 పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. కాగా మనీశ్ పాండే 22 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు.
10 ఓవర్లకు భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 28 పరుగులు, మనీశ్ పాండే 16 పరుగులతో ఆడుతున్నారు.
10 overs gone, #TeamIndia move to 6⃣0⃣/2⃣ in the chase. @SDhawan25 batting on 28@im_manishpandey unbeaten on 13#SLvIND
Follow the match ? https://t.co/HHeGcqYsmm pic.twitter.com/DVcJPeNDVk
— BCCI (@BCCI) July 20, 2021
ఇండియా 8 ఓవర్లకు 50 పరుగులు దాటింది. శిఖర్ ధావన్ 23 పరుగులు, మనీశ్ పాండే 9 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.
భారత్ 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్ 1 ఔటయ్యాడు. 5 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రజిత బౌలింగ్‌లో దారుణంగా ఔటయ్యాడు. గత మ్యాచ్‌లో ఇషాన్ 59 పరుగులు చేశాడు. కాగా శిఖర్ ధావన్ 23 పరుగులతో మనీశ్ పాండే 0 పరుగులతో ఆడుతున్నారు.
భారత్ 28 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా 13 పరుగులు ఔట్ అయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో గూగ్లీ బంతిని ఆడటానికి ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. కాగా శిఖర్ ధావన్ 21 పరుగులతో జోరుగా ఆడుతున్నాడు.
భారత్ మొదటి ఓవర్‌లో 14 పరుగులు సాధించింది. యువ ఓపెనర్ పృథ్వీ షా గొప్ప ఆరంభం చేశాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తొలి ఓవర్ నాలుగో, ఐదవ, ఆరవ బంతుల్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు.
276 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా క్రీజులోకి అడుగుపెట్టారు.
రెండో వన్డేలో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అసలంక 65 పరుగులు, అవిష్క ఫెర్నాండో 50 పరుగులు అర్ధ శతాకాలతో రాణించారు. చివరలో కరుణరత్నె చెలరేగిపోయాడు. 44 పరుగులు చేశాడు.
INNINGS BREAK: Sri Lanka post 275/9 on the board in the second #SLvIND ODI!
3⃣ wickets each for @yuzi_chahal & @BhuviOfficial
2⃣ wickets for @deepak_chahar965 for Charith Asalanka#TeamIndia‘s chase to begin shortly.
Scorecard ? https://t.co/HHeGcqGQXM pic.twitter.com/deG7MoXAeH
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక 266 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సందకాన్ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ రనౌట్ చేశాడు.
శ్రీలంక 264 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. చమీరా 2 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
శ్రీలంక 244 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అసలంక 65 పరుగులు ఔట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు ఉన్నాయి.
శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హసరంగా చాహార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లంక 40 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లకు 195 పరుగులు చేసింది.
.@deepak_chahar9 scalps his second wicket of the match. ? ?
Sri Lanka move to 195/6 after 40 overs. #TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/HHeGcqGQXM pic.twitter.com/c39TGY2YjM
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షనక చాహాల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లంక 36 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లకు 178 పరుగులు చేసింది.
…and another wicket for @yuzi_chahal! ??#TeamIndia #SLvIND
Follow the match ? https://t.co/HHeGcqGQXM
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డిసిల్వా చాహార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లంక 30 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లకు 144 పరుగులు చేసింది.
2nd ODI. 27.2: WICKET! D de Silva (32) is out, c Shikhar Dhawan b Deepak Chahar, 134/4 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుడుర్కున్న ఫెర్నాడోను భువనేశ్వర్ అవుట్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. దీనితో లంక జట్టు తన మూడో వికెట్‌ను పోగొట్టుకుంది. 25 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
2nd ODI. 24.6: WICKET! WIA Fernando (50) is out, c Krunal Pandya b Bhuvneshwar Kumar, 124/3 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
టీమిండియాకు మొదటి స్ట్రైక్ వచ్చింది. ఆఫ్ స్పిన్నర్ చాహల్ ఒకే ఓవర్‌లో ఇద్దరు లంక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ను పంపించాడు. హ్యాట్రిక్ తీశాడు అనుకుంటే.. అది జరగలేదు. వరుస బంతులకు భానుక(36), రాజపక్స(0)లను అవుట్ చేశాడు. దీనితో 14 ఓవర్లు ముగిసేసరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది.
Twin strikes from @yuzi_chahal! ? ?
Sri Lanka 77/2 after 13.3 overs as Minod Bhanuka & Bhanuka Rajapaksa depart. #SLvIND #TeamIndia
Follow the match ? https://t.co/HHeGcqGQXM pic.twitter.com/i32dlX5bqA
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే అర్ధ శతకం భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. అంతేకాకుండా జట్టు స్కోర్‌ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దీనితో లంక 10 ఓవర్లకు 59/0 చేసింది. భానుక(28), ఫెర్నాడో(26)తో క్రీజులో ఉన్నారు.
శ్రీలంక ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే లంక స్కోర్ అర్ధ శతకం దాటింది. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భానుక(26), ఫెర్నాడో(25)తో క్రీజులో ఉన్నారు.
2nd ODI. 7.4: Y Chahal to WIA Fernando (25), 4 runs, 53/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 28/0 పరుగులు చేసింది. భానుక(12), ఫెర్నాడో(15)తో క్రీజులో ఉన్నారు.
2nd ODI. 4.4: B Kumar to M Bhanuka (8), 4 runs, 24/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
2nd ODI. 4.6: B Kumar to M Bhanuka (12), 4 runs, 28/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
అవిష్క ఫెర్నాడో మెరుపులు మెరిపించాడు. దీపక్ చాహార్ వేసిన నాలుగో ఓవర్ మొదటి రెండు బంతులకు ఓ సిక్స్, ఓ ఫోర్ బాదుడు. దీనితో ఆ ఓవర్‌లో శ్రీలంక మొత్తంగా 12 పరుగులు రాబట్టింది.
2nd ODI. 3.1: D Chahar to WIA Fernando (7), 4 runs, 11/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
2nd ODI. 3.2: D Chahar to WIA Fernando (13), 6 runs, 17/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
దీపక్ చాహార్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ మీదగా శ్రీలంక ఓపెనర్ భానుక చక్కటి బౌండరీ కొట్టాడు. దీనితో శ్రీలంక రెండు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.
2nd ODI. 1.5: D Chahar to M Bhanuka (4), 4 runs, 6/0 https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ, చరిత్ అసలంక, హసరంగ, కరుణరత్నే, చమీర, సందకన్, రజిత
2nd ODI. Sri Lanka XI: WIA Fernando, M Bhanuka, B Rajapaksa, D de Silva, C Asalanka, D Shanaka, W Hasaranga, C Karunaratne, K Rajitha, D Chameera, L Sandakan https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
భారత్: ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్.
Toss & Team Update from Colombo:
Sri Lanka have elected to bat against #TeamIndia in the second #SLvIND ODI.
Follow the match ? https://t.co/HHeGcqGQXM
India retain the same Playing XI ? pic.twitter.com/MrVdZNj09g
— BCCI (@BCCI) July 20, 2021
సిరీస్‌ను తేల్చే కీలక మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో ఎలాగైనా గెలవాలనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది.
2nd ODI. Sri Lanka win the toss and elect to bat https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఇరు జట్లూ గెలుపే ద్యేయంగా బరిలోకి దిగారు. ఈ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్ళూరుతుంటే.. ఎలాగైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక తహతహలాడుతోంది.
Welcome to live coverage of the 2nd ODI between Sri Lanka and India https://t.co/HHeGcqYsmm #SLvIND
— BCCI (@BCCI) July 20, 2021
భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు.
Two squads ??
Fielding drills ?A run-through #TeamIndia‘s fun drill, courtesy fielding coach @coach_rsridhar ahead of their practice session ? – by @RajalArora #ENGvIND pic.twitter.com/NXZ4LI0aPR
— BCCI (@BCCI) July 19, 2021